Thursday, April 25, 2024
Homeస్పోర్ట్స్Kohli is back: పాకిస్తాన్ పై ఇండియా ఉత్కంఠ విజయం

Kohli is back: పాకిస్తాన్ పై ఇండియా ఉత్కంఠ విజయం

పురుషుల 20 వరల్డ్ కప్ లో భాగంగా…. నరాలు తెగే ఉత్కంత మధ్య సాగిన నేటి మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్ పై ఇండియా చివరి బంతికి అద్భుత విజయం సాధించింది. విరాట్ కోహ్లీ చాలా రోజుల తర్వాత తన పవరేంటో చాటి చెప్పాడు, 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిఛి ఈ మరపురాని గెలుపులో ప్రధాన భూమిక పోషించాడు. ఈ అపూర్వ విజయంతో ఒకరోజు ముందే దీపావళి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకునేలా చేసింది టీమిండియా. చివరి ఓవర్లో పాక్ బౌలర్ మహమ్మద్ నవాజ్ రెండు వైడ్లు, ఒక నో బాల్ వేయడంతో ఇండియా ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంది.

పాక్ విసిరిన 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో విరాట్ కోహ్లీ- హార్దిక్ పాండ్యా  నాలుగో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే  చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా మొదటి బంతికి పాండ్యా (40) ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన కార్తీక్ ఒక్క పరుగు తీసి స్ట్రైక్ కోహ్లీకి ఇచ్చాడు. కోహ్లీ రెండు, సిక్సర్ (నోబాల్, వైడ్) ఆ తర్వాత మూడు పరుగులు చేయగా కార్తీక్ కు స్ట్రైక్ వచ్చింది, ఈ బంతికి కార్తీక్ స్టంప్ అవుట్ అయ్యాడు. ఒక బంతి, రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. అయితే ఈ బంతి కూడా వైడ్ అయ్యింది. స్కోర్లు లెవల్ అయ్యాయి. చివరి బంతికి అశ్విన్ సింగల్ తీయడంతో టీమిండియా గెలుపు సొంతం చేసుకుంది. స్టేడియంలో సంబరాలు మిన్నంటాయి.

మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  పాక్ ఆటగాళ్ళలో ఇఫ్తికార్ అహ్మద్-51; మసూద్-52, షాహీన్ అఫ్రిది-16 పరుగులు చేయడంతో పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది.

ఇండియా బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో మూడు; భువీ, షమీ చెరో వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత బ్యాటింగ్ లో ఇండియా ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ(4); కెఎల్ రాహుల్ (4) విఫలమయ్యారు. కొంతకాలంగా మంచి ఫామ్ లో ఉన్న సూర్య కుమార్ యాదవ్(15); అక్షర్ పటేల్ (2) కూవా త్వరగా పెవిలియన్ చేరారు. ఈ దశలో కోహ్లీ-పాండ్యా క్రీజులో నిలదొక్కుకుని గెలుపు దిశగా జట్టును తీసుకెళ్ళారు.

కోహ్లీ కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్