Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్క్వార్టర్ ఫైనల్లో బెల్జియంతో ఇండియా ఢీ

క్వార్టర్ ఫైనల్లో బెల్జియంతో ఇండియా ఢీ

ఓడిశా రాజధాని భువనేశ్వర్, కళింగ స్టేడియంలో జరుగుతున్న పురుషుల హాకీ జూనియర్ వరల్డ్ కప్ లో  నేటితో పూల్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇండియా క్వార్టర్ ఫైనల్స్ లో బెల్జియంతో తలపడనుంది. డిసెంబర్ 1న ఉదయం 10.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.

ఇప్పటికే పూల్ ‘ఏ’ నుంచి బెల్జియం, మలేషియా…. పూల్ ‘బి’ నుంచి ఫ్రాన్స్, ఇండియా  జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్న సంగతి తెలిసింది.

నేడు జరిగిన మ్యాచ్ ల తరువాత పూల్ ‘సి’ నుంచి నెదర్ల్యాండ్స్, స్పెయిన్పూల్ ‘డి’ నుంచి అర్జెంటీనా, జర్మనీ జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నాయి

ఈరోజు పూల్ ‘సి’ మ్యాచ్ ల్లో కొరియాపై స్పెయిన్ 9-0 తేడాతో విజయం సాధించగా, నెదర్ల్యాండ్స్ 14-0 గోల్స్ తేడాతో అమెరికాను చిత్తు చేసింది.

పూల్ ‘డి’ మ్యాచ్ ల్లో పాకిస్తాన్ పై అర్జెంటీనా 3-4 తేడాతో గెలిచింది. మరో మ్యాచ్ లో జర్మనీ 11-0  గోల్స్ తేడాతో ఈజిప్ట్ ను ఓడించింది.

Also Read : మలేషియా-బెల్జియం మ్యాచ్ డ్రా

RELATED ARTICLES

Most Popular

న్యూస్