జనవరి, 2023లో జరగనున్న పురుషుల హాకీ వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఇంటర్నేషనల్ ఫెడరేషన్ అఫ్ హాకీ (ఎఫ్ఐహెచ్) నేడు వెల్లడించింది. ఇండియా ఈ మెగా టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇస్తుండగా ఓడిశాలోని రెండు వేదికలు భువనేశ్వర్-కళింగ స్టేడియం, రూర్కెలా – బిర్సా ముందా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం లలో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి.
జనవరి 13 నుంచి 29 వరకూ జరిగే ఈ టోర్నమెంట్ లో తొలి రోజున నూతనంగా నిర్మించిన బిర్సా ముండా స్టేడియంలో భారత జట్టు స్పెయిన్ తో తలపడనుంది, 15న ఇంగ్లాండ్, 19న వేల్స్ తో లీగ్ దశ మ్యాచ్ లు ఆడనుంది. మొత్తం నాలుగు పూల్స్ లో ఒక్కో దానిలో నాలుగు జట్లు ఉంటాయి. ఇండియా తో పాటు స్పెయిన్, ఇంగ్లాండ్, వేల్స్ జట్లు ఉన్నాయి. లీగ్ దశ ముగిసే నాటికి నాలుగు పూల్స్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు క్వార్టర్స్ కు చేరుకుంటాయి. ఓడిశాలోని ఈ రెండు స్టేడియాల్లో కలిపి మొత్తం 44 మ్యాచ్ లు జరగనున్నాయి.