Friday, November 22, 2024
Homeస్పోర్ట్స్అక్టోబర్ 24 న హై వోల్టేజ్ మ్యాచ్

అక్టోబర్ 24 న హై వోల్టేజ్ మ్యాచ్

క్రికెట్ టి-20 వరల్డ్ కప్ లో ఇండియా- పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 24న జరగనుంది. దుబాయ్ వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ జరిగే ఈ వరల్డ్ కప్ షెడ్యూల్ ను ఐసిసి ప్రకటించిన సంగతి తెలిసిందే. బిసిసిసి ఈ టోర్నీకి హాస్ట్ గా వ్యవహరిస్తోంది. కోవిడ్ నేపథ్యంలో ఇండియాలో జరగాల్సిన ఈ మ్యాచ్ ల వేదికను ఒమన్, యూఏఈ మార్చారు.

ఐసిసి గతంలో ప్రకటించిన గ్రూపుల విభజనలో ఇండియా, పాకిస్తాన్ లు గ్రూప్-2 లో ఉన్నాయి. ఈ రెంటితో పాటు న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి.

ఇండియా పాకిస్తాన్ జట్లు జూన్ 16న జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో చివరిసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఇండియా 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ 113బంతుల్లో 3సిక్సర్లు, 14 ఫోర్లతో 140 పరుగులు సాధించాడు.

టి -20 వరల్డ్ కప్ షెడ్యూల్ పరిశీలిస్తే మొదట అక్టోబర్ 17 నుంచి 23 వరకూ గ్రూప్ ‘ఏ’, ‘బి’ మ్యాచ్ లు జరుగుతాయి.

  • గ్రూప్ ఏ లో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా
    గ్రూప్ బి లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పి.ఎన్.బి., ఒమన్ ఉన్నాయి.

ఈ రెండు గ్రూపుల నుంచి నాలుగు జట్లు సూపర్ 12 లో చోటు సంపాదిస్తాయి

  • గ్రూప్ 1లో…. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ తో పాటు గ్రూప్ ‘ఏ’ విన్నర్, గ్రూప్ ‘బి’ రన్నర్
    గ్రూప్2 లో…. ఇండియా, పకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, గ్రూప్ ‘బి’ విన్నర్, గ్రూప్ ‘ఏ’ రన్నర్

అక్టోబర్ ౩౦న న్యూజిలాండ్; నవంబర్ 1న ఆఫ్ఘనిస్తాన్; నవంబర్ 5న గ్రూప్ ‘ఏ’ రన్నర్’ నవంబర్ 8న గ్రూప్ ‘బి’ విన్నర్ జట్లతో ఇండియా తలపడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్