Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ప్రో లీగ్ హాకీ: అర్జెంటీనాపై ఇండియా షూటౌట్

ప్రో లీగ్ హాకీ: అర్జెంటీనాపై ఇండియా షూటౌట్

ప్రోలీగ్ మహిళల హాకీ టోర్నీలో భాగంగా నేడు జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనాపై ఇండియా షూటౌట్ లో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో 3-3తో మ్యాచ్ డ్రా గా ముగిసింది.

ఆట నాలుగో నిమిషంలోనే ఇండియా ప్లేయర్ లాల్ రేమ్సియామి తొలి ఫీల్డ్ గోల్ తో బోణీ చేసింది. 22, 37 నిమిషాల్లో అర్జెంటీనా రెండు గోల్స్ చేసింది. 37వ నిమిషంలో గుర్జీత్ కౌర్ పెనాల్టీ కార్నర్ తో గోల్ చేయడంతో స్కోరు 2-2తో సమం అయ్యింది. 45వ నిమిషంలో అర్జెంటీనా మూడో గోల్ చేయగా, 51వ నిమిషంలో గుర్జీత్ మరో గోల్ చేసి మళ్ళీ స్కోరును సమం చేసింది. నిర్ణీత సమయం ముగిసే వరకూ ఇరు జట్లూ మరో గోల్ సాధించలేకపోయాయి.

దీనితో షూటౌట్ కు వెళ్ళాల్సి వచ్చింది. దీనిలో ఇండియా 2-1 తేడాతో పైచేయి సాధించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్