Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్Ind Vs Eng: నాలుగో టెస్టులో ఇండియా ఘన విజయం: సిరీస్ కైవసం

Ind Vs Eng: నాలుగో టెస్టులో ఇండియా ఘన విజయం: సిరీస్ కైవసం

ఇంగ్లాండ్ తో జరుగుతోన్న నాలుగో టెస్టులో ఇండియా ఐదు వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 3-1తో ఆదిక్యం సంపాదించి మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్ ను చేజిక్కించుకుంది. ఆరంగ్రేటం చేసిన తొలి మ్యాచ్ లోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ధృవ్ జురెల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

192 పరుగుల విజయ లక్ష్యంతో నిన్న తుది ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇండియా ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.  యశస్వి జైస్వాల్ 37 పరుగులు చేసి జట్టు స్కోరు 84 వద్ద తొలి వికెట్ గా వెనుదిరిగాడు. రోహిత్ శర్మ అర్ధ సెంచరీ (55) పూర్తి చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే రజిత్ పటీదార్ డకౌట్ అయ్యాడు. జట్టు స్కోరు 120వద్ద రెండు వరుస బంతుల్లో రవీంద్ర జడేజా(4), సర్ఫ్ రాజ్ ఖాన్ (డకౌట్) లను ఇంగ్లాండ్ బౌలర్ బషీర్ ఔట్ చేశాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ధృవ్… శుభ్ మన్ గిల్ తో కలిసి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. గిల్ 52, ధృవ్ 39 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోహిబ్ బషీర్ 3; జో రూట్, టామ్ హార్ట్ లీ చెరో వికెట్ సాధించారు.

సిరీస్ లో చివరి టెస్ట్ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల స్టేడియంలో మార్చి 7న మొదలు కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్