Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్Women’s T20 WC:  విండీస్ పై ఇండియా విజయం

Women’s T20 WC:  విండీస్ పై ఇండియా విజయం

మహిళల టి20 వరల్డ్ కప్ లో ఇండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడించిన ఇండియా నేడు జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ మైదానంలో జరిగిన నేటి మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ 4 పరుగులకే తొలి వికెట్ (కెప్టెన్ హెలీ మాథ్యూస్-2) కోల్పోయింది. రెండో వికెట్ కు క్యాంప్ బెల్లె- టేలర్ లు 73 పరుగులు జోడించారు. ఈ సమయంలోనే మూడు పరుగుల తేడాతో మూడు వికెట్లు (టేలర్-42; క్యాంప్ బెల్లె-32; హెన్రీ-2) విండీస్ కోల్పోయింది. ఆ తర్వాత నేషన్-21; గజ్నాబి-15 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 118 పరుగులు చేసింది.

దీప్తి శర్మ మూడు; రేణుకా సింగ్, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ పడగొట్టారు.

ఇండియా 32 పరుగుల వద్ద తొలి వికెట్ (స్మృతి మందానా-10) కోల్పోయింది. ఆ కాసేపటికే జెమైమా రోడ్రిగ్యూస్ (1) పెవిలియన్ చేరింది. ­జట్టు స్కోరు 43 వద్ద షఫాలీ వర్మ(28) ఔటయ్యింది. ఈ దశలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్- వికెట్ కీపర్ రిచా ఘోష్ లు నాలుగో వికెట్ కు 72 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు. హర్మన్ 42 బంతుల్లో 3 ఫోర్లతో 33 పరుగులు చేసి చివర్లో ఔట్ కాగా, రిచా ఘోష్ 32 బంతుల్లో 5 ఫోర్లతో 44 పరుగులతో నాటౌట్ గా నిలిచింది. 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యం సాధించింది.

మూడు వికెట్లు తీసిన దీప్తి శర్మకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది. ఈ మ్యాచ్ లో మూడో వికెట్ తీసిన అనంతరం టి 20ల్లో వంద వికెట్లు సాధించిన భారత బౌలర్ గా దీప్తి రికార్డు దక్కించుకుంది.

Also Read : ICC Rankings: అన్ని ఫార్మాట్లలోనూ ఇండియా టాప్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్