Women WC: ఐసిసి మహిళా క్రికెట్ వరల్డ్ కప్ -2022 శుక్రవారం నుంచి మొదలుకానుంది. న్యూజిలాండ్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. మొత్తం ఎనిమిది జట్లు…ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్, వెస్టిండీస్ ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. మార్చి4 న మొదలయ్యే ఈ టోర్నీ ఏప్రిల్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగుస్తుంది.
ఇండియా తన మొదటి మ్యాచ్ ను దాయాది పాకిస్తాన్ తో ఆదివారంనాడు (మార్చి 6న) తలపడనుంది.
మార్చి 10న న్యూజిలాండ్ తో; 12న వెస్టిండీస్; 16న ఇంగ్లాండ్; 19న ఆస్ట్రేలియా; 22న బంగ్లాదేశ్; 27న సౌతాఫ్రికా దేశాలతో తలపడనుంది. ఇండియా ఆడే మ్యాచ్ లన్నీ భారత కాలమానం ప్రకారం ఉదయం ఆరున్నర గంటలకు మొదలవుతాయి.
పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ కు చేరుకుంటాయి, మార్చి 30,31 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి. న్యూ జిలాండ్ లోని మొత్తం ఆరు వేదికల్లో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. క్రిస్ట్ చర్చ్ లోనిహేగ్లీ ఓవల్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఏప్రిల్ 3న జరగనుంది.