Saturday, September 21, 2024
Homeస్పోర్ట్స్తొలి టి-20లో ఇండియా విజయం

తొలి టి-20లో ఇండియా విజయం

India Vs. WI: వెస్టిండీస్ తో జరుగుతున్న మూడు టి 20ల సిరీస్ లో భాగంగా నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్ విసిరిన 158 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలోనే ఛేదించింది. ఇండియా మొదటి వికెట్ కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కెప్టెన్ రోహిత్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ 35; విరాట్ కోహ్లీ 17; రిషభ్ పంత్ 8 పరుగులుచేసి ఔటవ్వగా, సూర్యకుమార్ యాదవ్- 34; వెంకటేష్ అయ్యర్ 24 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయపథంలో నడిపించారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేస్ రెండు; కట్రెల్, ఫబియన్ అల్లెన్ చెరో వికెట్ పడగొట్టాడు.

కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో ఇండియా బరిలోకి దిగింది.  రవి బిష్ణోయ్ ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ టి 20ల్లో ఆరంగ్రేటం చేశాడు.  వెస్టిండీస్ 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. రెండో వికెట్ కు కేల్  మేయర్స్-నికోలస్ పూరన్ రెండో వికెట్ కు 47 పరుగులు జోడించారు. మేయర్స్ 24 బంతుల్లో 7 ఫోర్లతో 31 పరుగులు చేసి చాహల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. నికోలస్ 43 బంతుల్లో 4 ఫోర్లు 5 సిక్సర్లతో 61 పరుగులు చేయగా; కెప్టెన్ పోలార్డ్ 19 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ తో 24 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. వీరు ముగ్గురు మినగా మిలిన బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు.  నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇండియా బౌలర్లలో హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ చెరో రెండు; భువీ, చాహర్, చాహల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఇండియా మూడు మ్యాచ్ ల టి 20 సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది.

రవి బిష్ణోయ్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్