Sunday, September 22, 2024
Homeస్పోర్ట్స్Guwahati T20: పోరాడి ఓడిన సౌతాఫ్రికా

Guwahati T20: పోరాడి ఓడిన సౌతాఫ్రికా

ఇండియాతో జరిగిన రెండో టి 20 లో సౌతాఫ్రికా పోరాడి ఓడిపోయింది. 237 పరుగుల భారీ లక్ష్య సాధన కోసం బరిలోకి దిగిన ప్రోటీస్ జట్టు 3 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేయడంతో ఇండియా 16 పరుగులతో విజయం సాధించి మ్యాచ్ తో పాటు సిరీస్ ను కూడా గెల్చుకుంది.

గువహతి లోని బరస్పర స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా తొలి వికెట్ కు 96 పరుగులు జోడించింది. టాపార్డర్  బ్యాట్స్ మెన్ అందరూ రాణించారు. సూర్యకుమార్ యాదవ్ మరోసారి చెలరేగి ఆడాడు 22  బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో  61 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఓపెనర్లు కెఎల్ రాహుల్- 57 (28 బంతుల్లో ­5 ఫోర్లు, 4 సిక్సర్లు); కెప్టెన్ రోహిత్-43 పరుగులు చేసి అవుట్ కాగా…. విరాట్ కోహ్లీ-49;  (28 బంతుల్లో ­7 ఫోర్లు, 1సిక్సర్); చివర్లో దినేష్ కార్తీక్ ఏడు బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 17 పరుగులతో అజేయంగా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేయగలిగింది.

సౌతాఫ్రికా బౌలర్లలో పార్నెల్, నిగిడి చెరో వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా ఒక్క పరుగు వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ బావుమా, రీలీ రోస్సో ఇద్దరూ డకౌట్ అయ్యారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో అర్షదీప్ ఈ రెండు వికెట్లూ పడగొట్టాడు.  ఆ తర్వాత ధాటిగా ఆడుతున్న ఏడెన్ మార్క్రమ్ ను అక్షర్ బౌల్డ్ చేశాడు. దీనితో 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మరో ఓపెనర్ డికాక్- డేవిడ్ మిల్లర్ కు కలిసి నాలుగో వికెట్ కు అజేయమైన 174 పరుగులు జోడించారు.

కెఎల్ రాహుల్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

Also Read India Vs Australia: మొదటి టి20లో ఆసీస్ అద్భుత విజయం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్