Tuesday, April 16, 2024
Homeస్పోర్ట్స్Rohith, Dinesh: మొదటి టి20 ఇండియాదే

Rohith, Dinesh: మొదటి టి20 ఇండియాదే

వెస్టిండీస్ తో జరిగిన తొలి 20 మ్యాచ్ లో ఇండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.  కెప్టెన్ రోహిత్ శర్మ-64; దినేష్ కార్తీక్-41 నాటౌట్; సూర్య కుమార్ యాదవ్-24; జడేజా-16 పరుగులతో సత్తా చాటారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇండియా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 122 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ లో విండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా తొలి వికెట్ కు 44 పరుగులు చేసింది, సూర్య 24 పరుగులు చేసి ఔటయ్యాడు, ఆ వెంటనే శ్రేయాస్ అయ్యర్ డకౌట్ అయ్యాడు. రోహిత్ 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 చేసి ఐదో వికెట్ గా వెనుదిరిగాడు.  దినేష్ కార్తీక్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ రెండు; ఒబేద్ మెక్ రాయ్, హోల్డర్,  అకీల్ హోసేన్, కీమో పాల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

విండీస్ బ్యాట్స్ మెన్ లో షమ్రా బ్రూక్స్ 20 పరుగులతో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. చివర్లో కీమో పాల్ 19 పరుగులతో నాటౌట్ ఉన్నాడు, 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది.

దినేష్ కార్తీక్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : ఇండియాదే  వన్డే సిరీస్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్