Thursday, January 23, 2025
Homeస్పోర్ట్స్చివరి టి20లోనూ ఇండియాదే విజయం

చివరి టి20లోనూ ఇండియాదే విజయం

జింబాబ్వే తో జరుగుతోన్న ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లోని చివరి మ్యాచ్ లో కూడా ఇండియా 42 పరుగులతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 4-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది.  హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా నేడు జరిగిన చివరి మ్యాచ్‌లో జింబాబ్వే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేయగా జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇండియా బ్యాట్స్ మెన్ సంజూ శామ్సన్-58; శివమ్ దూబే-26; రియాన్ పరాగ్-22 పరుగులతో రాణించారు.

లక్ష్య సాధనలో జింబాబ్వే జట్టులో డియాన్ మేయర్స్-34; మరుమణి-27; ఫరాజ్ అక్రమ్-27 పరుగులు చేశారు. ఇండియా బౌలర్లలో ముఖేష్ కుమార్ -4; శివమ్ దూబే 2; దేశ్ పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు.

ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ శివమ్ దూబేకు దక్కగా… వాషింగ్టన్ సుందర్ ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ గెల్చుకున్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్