Friday, November 22, 2024
Homeస్పోర్ట్స్బ్యాటింగ్ లో రాణించిన దీపక్ చాహర్ : ఇండియాదే వన్డే సిరీస్

బ్యాటింగ్ లో రాణించిన దీపక్ చాహర్ : ఇండియాదే వన్డే సిరీస్

బౌలర్ దీపక్ చాహర్ ఆల్ రౌండ్ ప్రతిభతో  కొలంబోలోని ప్రేమదాస స్టేడియం లో జరిగిన జరిగిన రెండో వన్డేలో కూడా శ్రీలంకపై అద్భుత విజయం సాధించి సీరీస్ ను కైవసం చేసుకుంది ఇండియా.  టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత యాభై ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నండో 50(71); అసలంక 65 (68); కరుణ రత్నే44(33) లు రాణించడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. భారత బౌలింగ్ లో…. మొదటి వన్డేలో నిరాశపరచిన పేస్ బౌలర్ భువీ ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు పడగొట్టాడు. మొదటి మ్యాచ్ లో రెండు వికెట్లు తీసిన యజువేంద్ర చాహల్ ఈ వన్డేలో మూడు వికెట్లు సాధించాడు. దీపక్ చాహర్ రెండు వికెట్లు తీశాడు.

276 పరుగుల క్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మొదటి ఐదు ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయింది. పృథ్వీ షా (13), ఇషాన్ (1) నిరాశపరిచారు. 29 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కెప్టెన్ ధావన్ ఎల్బీగా వెనుదిరిగాడు. మనీష్ పాండే, సూర్యకుమార్ లు ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయతం చేశారు. అయితే లంక కెప్టెన్ షనక వేసిన 18 వ ఓవర్లో  ఇండియా రెండు వికెట్లు కోల్పోయింది. 116 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో   సూర్య, క్రునాల్ మరోసారి ఇండియా ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. సూర్యకుమార్­ – 53, క్రునాల్ -35  పరుగులు చేశారు. వీరిద్దరూ ఔట్ కావడంతో ఇండియా మరోసారి చిక్కుల్లో పడింది. ఈ దశలో బ్యాటింగ్ కు వచ్చిన దీపక్ చాహర్ ఏమాత్రం బెరుకు లేకుండా జట్టును విజయ తీరాల వైపు నడిపించాడు. దీపక్ 82 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ తో 69 పరుగులు చేశారు. చివర్లో భువీ కూడా 28బంతుల్లో  రెండు ఫోర్లతో 19 పరుగులు చేసి దీపక్ కు సహకరించాడు. రెండు వికెట్ల తోపాటు 69 పరుగులు చేసిన దీపక్ చాహర్ ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ అందుకున్నాదు.  మూడో వన్డే  శుక్రవారం జరగనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్