Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్విశాఖ టి20లో ఇండియా విజయం

విశాఖ టి20లో ఇండియా విజయం

India Won:  సౌతాఫ్రికాతో జరిగిన మూడో టి 20లో ఇండియా ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్ లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా…. బౌలింగ్ లో హర్షల్ పటేల్, యజువేంద్ర చాహల్, రాణించడంతో ఇండియా 48 పరుగులతో గెలుపొందింది.

విశాఖపట్నంలోని డా. వైఎస్సార్ ఏసిఏ-విడిసిఏ స్టేడియంలో జరిగిన సౌతాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు రుతురాజ్- ఇషాన్ లు తొలి వికెట్ కు 97 పరుగుల చక్కని భాగస్వామ్యం నెలకొల్పారు. రుతురాజ్ గైక్వాడ్ 35 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 57;  ఇషాన్ కిషన్ 35 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లతో 54  పరుగులు చేశారు. శ్రేయాస్-14; అయ్యర్, కెప్టెన్ పంత్-6, దినేష్ కార్తీక్-6 విఫలమైనా… చివర్లో పాండ్యా 21 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 179 పరుగులు చేసింది.

ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా 23 పరుగులకే తొలి వికెట్ (కెప్టెన్ బావుమా-8) కోల్పోయింది. ఆ తరువాత సరైన భాగస్వామ్యం నెలకొల్పడంలో జట్టు విఫలమైంది. గత రెండు మ్యాచ్ ల్లో రాణించిన డస్సెన్, క్లాసేన్ లను యజువేంద్ర చాహల్ చక్కటి బంతులతో పెవిలియన్ పంపాడు. హర్షల్ పటేల్ నాలుగు వికెట్లతో రాణించాడు. ప్రోటీస్ జట్టులో క్లాసేన్-29; హెండ్రిక్స్-23;  పార్నెల్-22; ప్రెటోరియస్-20; మాత్రమే ఫర్వాలేదనిపించారు. 19.1 ఓవర్లలో 131  పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్ అయ్యింది. ఇండియా బౌలర్లలో హర్షల్-4;  యజువేంద్ర చాహల్-3; భువీ, అక్షర్ చెరో వికెట్ పడగొట్టారు.

యజువేంద్ర చాహల్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

నాలుగో మ్యాచ్ శుక్రవారం 17న రాజ్ కోట్ లో జరగనుంది.

Also Read : మొన్న డస్సేన్ – నేడు క్లాసేన్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్