BATC-2022: బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్ షిప్ 2022 టోర్నమెంట్ లో ఇండియా కథ ముగిసింది. పురుషులు, మహిళల జట్లు రెండూ నాకౌట్ దశకు చేరుకోలేకపోయాయి. మలేషియా, సేలంగోర్ లోని షా అస్లాం, సేతియా సిటీ కన్వెన్షన్ సెంటర్ లో ఈ పోటీలు జరుగుతున్నాయి.
పురుషుల విభాగంలో ఈనెల 15న జరిగిన తొలి లీగ్ లో సౌత్ కొరియా చేతిలో 0-5 తేడాతో ఓటమి పాలైన ఇండియా నిన్న జరిగిన పోరులో హాంగ్ కాంగ్ పై 3-2తో ఆధిక్యం సంపాదించింది. నేడు ఇండోనేషియాతో జరిగిన పోరులో 3-2 తేడాతో ఓటమి పాలుకావడంతో టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. నేటి మ్యాచ్ ల్లో లక్ష్య సేన్, మిథున్ మంజునాథ్ సింగల్స్ లో విజయం సాధించగా, కిరణ్ జార్జ్ సింగిల్స్ లోనూ, మంజిత్- డింకూ సింగ్; హరి హరన్-రుబాన్ కుమార్ జోడీలు డబుల్స్ లో విఫలమయ్యారు.
మహిళల విభాగంలో 16న జరిగిన తొలి లీగ్ లో మలేషియా చేతిలో 3-2 తో ఓటమి పాలైన ఇండియా, నేడు జపాన్ చేతిలో 4-1 తో ఓడిపోయి టోర్నీ నుంచి వైదొలిగింది. మలేషియా మ్యాచ్ లో సింగిల్స్ లో ఆశ్మిత చాలిహా, తారా షా రాణించగా, నేడు జపాన్ పై ఆశ్మిత మాత్రమే విజయం సాధించింది. డబుల్స్ లో రెండు లీగ్ ల్లోనూ నిరాశే ఎదురైంది.
Also Read : కివీస్ మహిళలదే వన్డే సిరీస్