Thursday, March 28, 2024
Homeస్పోర్ట్స్CWG-2022: Hockey- Men: ఫైనల్లో ఇండియా

CWG-2022: Hockey- Men: ఫైనల్లో ఇండియా

భారత పురుషుల హాకీ జట్టు కామన్ వెల్త్ గేమ్స్ ఫైనల్లో చేరి గోల్డ్ మెడల్ రేసులో నిలిచింది. నేడు జరిగిన సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాను 3-2తో ఓడించింది.

ఆట తొలి పావు భాగంలో ఇరు జట్లూ గోల్ చేయలేకపోయాయి

రెండో పావు భాగంలో ఇండియా రెండు గోల్స్ చేసింది. 20వ నిమిషంలో అభిషేక్(ఫీల్డ్ గోల్); 28వ నిమిషంలో మన్ దీప్ సింగ్ (పెనాల్టీ కార్నర్) గోల్స్ చేశారు. దీనితో మొదటి అర్ధ  భాగానికి ఇండియా 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

ఆట 33వ నిమిషం వద్ద సౌతాఫ్రికా తొలి గోల్ చేసింది. 58 నిమిషం వద్ద ఇండియా ప్లేయర్ జుగ్ రాజ్ సింగ్ పెనాల్టీ కార్నర్ గోల్ సాధించి ఆధిక్యాన్ని ­3-1 కి తీసుకెళ్ళాడు.

మరో నిమిషంలో ఆట ముగుస్తుందనగా సౌతాఫ్రికా ఆటగాడు ముస్తఫా ఫీల్డ్ గోల్ చేశాడు.

ఆట పూర్తయ్యే సమయానికి ఇండియా 3-2తో ఆధిక్యంతో నిలిచి ఫైనల్ కు చేరుకుంది.

సోమవారం జరగబోయే గోల్డ్ మెడల్ పోరులో ఆస్ట్రేలియా జట్టుతో ఇండియా తలపడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్