Thursday, May 8, 2025
Homeస్పోర్ట్స్CWG-2022: Men’s Hockey: సెమీఫైనల్ కు ఇండియా

CWG-2022: Men’s Hockey: సెమీఫైనల్ కు ఇండియా

కామన్ వెల్త్ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు సెమీ ఫైనల్స్ కు చేరుకుంది. వేల్స్ తో నేడు జరిగిన మ్యాచ్ లో 4-1 తేడాతో విజయం సాధించి పతకం రేసులో నిలిచింది.

హర్మన్ ప్రీత్ సింగ్ మరోసారి సత్తా చాటి హ్యాట్రిక్ గోల్స్ తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఆట 18,19  నిమిషాల్లో రెండు పెనాల్టీ కార్నర్ గోల్స్ సాధించిన హర్మన్ 41వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్ ద్వారా మరో గోల్ సంపాదించాడు. 49వ నిమిషం వద్ద గుర్జాంత్ సింగ్ మరో గోల్ సాధించి ఇండియా ఇండియా ఆధిక్యాన్ని 4-0కు చేర్చాడు. అయితే 55వ నిమిషం వద్ద వేల్స్ జట్టు పెనాల్టీ కార్నర్ ద్వారా ఒక గోల్ చేసి ఆధిక్యాన్ని 4-1కి తగ్గించగలిగింది.

రేపటి సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియా జట్టు ఆస్ట్రేలియా తో తలపడనుంది.

Also Read : Women Hockey: సెమీస్ కు ఇండియా

RELATED ARTICLES

Most Popular

న్యూస్