Wednesday, April 17, 2024
HomeTrending Newsహాకీలో భారత్ కు కాంస్యం

హాకీలో భారత్ కు కాంస్యం

టోక్యో ఒలింపిక్స్ పురుషుల హాకీలో ఇండియా జట్టు కాంస్య పతకం గెల్చుకుంది. నేడు జరిగిన మ్యాచ్ లో ఇండియా జట్టు జర్మనీ పై 5-4 తేడాతో విజయం సాధించి 41 ఏళ్ళ తరువాత ఇండియాకు హాకీలో పతకం సాధించింది.

  • ఆట మొదట్లోనే జర్మనీ ఆటగాడు తైమూర్ ఒరుజ్ గోల్ సాధించాడు
  • రెండో పావు బాగంలో సిమ్రన్ జీత్ ఇండియాకు మొదటి గోల్ అందించాడు
  • రుహ్రేర్, ఫర్క్ జర్మనీకి చెరో గోల్ సాధించి 3-1ఆధిక్యాన్ని తెచ్చిపెట్టారు
  • హార్దిక్ సింగ్ ఇండియాకు మరో గోల్ అందించాడు. ఆ వెంటనే హర్మన్ ప్రీత్ పెనాల్టీ కార్నర్ ద్వారా మరో గోల్ తెచ్చిపెట్టాడు. దీనితో స్కోర్లు సమం అయ్యాయి.
  • ఆట మూడో భాగం మొదట్లోనే రూపిందర్ సింగ్  పెనాల్టీ కార్నర్ తో గోల్, సిమ్రాన్ జీత్ మరో గోల్ అందించి ఇండియా ఆధిక్యాన్ని 5-3 కు పెంచారు.
  • చివరి బాగంలో విండ్ ఫెదర్ జర్మనీ మరో గోల్ చేశాడు. దీనితో స్కోరు 5-4 అయ్యింది

జర్మనీ మరో గోల్ సాధించకుండా ఇండియా ఆటగాళ్ళు అడ్డుకోవటంతో ­5-4 తేడాతో ఇండియా కాంస్య పతక విజేతగా నిలిచింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్