Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్Malaysia Masters: తొలి రోజు ఇండియాకు నిరాశ

Malaysia Masters: తొలి రోజు ఇండియాకు నిరాశ

కౌలాలంపూర్ లో జరుగుతోన్న మలేషియా మాస్టర్స్-2022 టోర్నమెంట్ లో తొలిరోజు ఇండియాకు నిరాశ ఎదురైంది.  నేడు వివిద విభాగాల్లో ఆడిన  ఆటగాళ్ళు అంతా పరాజయం పాలయ్యారు.

మహిళల సింగిల్స్ లో మాళవిక బన్సోద్…. మహిళల డబుల్స్ లో త్రెసా జాలీ- గాయత్రి గోపీచంద్; పూజా దండు- ఆర్తి సారా; అశ్విని భట్, శిఖా గౌతమ్ జోడీలు తమ ప్రత్యర్థులపై ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించారు.

రేపు జరిగే పోటీల్లో సింగిల్స్ విభాగంలో…  పివి సింధు, సైనా నెహ్వాల్, సాయి ప్రనీత్, హెచ్ ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ , పారుపల్లి కాశ్యప్….. డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్ప- సిక్కీరెడ్డి జోడీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్