Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్CWG-2022: ఫైనల్స్ కు సింధు, మహిళా హాకీకి కాంస్యం

CWG-2022: ఫైనల్స్ కు సింధు, మహిళా హాకీకి కాంస్యం

కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో తెలుగు తేజం పివి సింధు ఫైనల్స్ కు చేరుకుంది. నేడు జరిగిన సెమీస్ మ్యాచ్ లో సింగపూర్ ప్లేయర్ యో జిన్ మిన్ పై 21-19, 21-17తేడాతో విజయం సాధించింది. జిన్ మిన్ సిందుకు గట్టి పోటీ ఇచ్చింది.

మరోవైపు మహిళల హాకీలో ఇండియాకు కాంస్యం దక్కింది. నేటి బ్రాంజ్ మెడల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై  షూటౌట్ (2-1) తో విజయం సాధించింది. ఆట రెగ్యులర్ సమయంలో 1-1తో స్కోరు సమం కావడంతో షూటౌట్ కు వెళ్ళాల్సి వచ్చింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్