Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్India (W) Vs. England (W): రాణించిన స్మృతి మందానా: ఇండియా విజయం

India (W) Vs. England (W): రాణించిన స్మృతి మందానా: ఇండియా విజయం

ఇండియా – ఇంగ్లాండ్  మహిళా జట్ల మధ్య జరుగుతోన్నరెండో టి 20 మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. ఓపెనర్ స్మృతి మందానా 53 బంతుల్లో 13 ఫోర్లతో 79పరుగులు చేసి నాటౌట్ గా నిలవడంతో ఇంగ్లాండ్ విసిరిన 142 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇండియా 16.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి సాధించింది.

డెర్బీ కంట్రీ గ్రౌండ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. భారత మహిళలు బౌలింగ్  తో పాటు ఫీల్డింగ్ లో అద్భుతంగా రాణించడంతో ఇంగ్లాండ్ 16 పరుగులకే మూడు  వికెట్లు  (డంక్లీ -5; డి వ్యాట్-6; ఆలీస్ క్యాప్సీ- 4) కోల్పోయింది. కొద్ది పరుగుల తేడాతోనే మరో రెండు వికెట్లు (బ్రయోనీ స్మిత్-16; అమీ జోన్స్-17) ఆతిథ్య జట్టు కోల్పోయింది.  ఈ దశలో బౌచియిర్-ఫ్రేయా కెంప్ లు ఆరో వికెట్ కు 65పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రాణించారు. బౌచియిర్ 34పరుగులు చేసి  ఔట్ కాగా, కెంప్ 37 బంతుల్లో 3 ఫోర్లు, 3  సిక్సర్లతో 51పరుగులు చేసి అజేయంగా నిలిచింది. నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో స్నేహ రానా మూడు; రేణుకా సింగ్, దీప్తి శర్మ చెరో వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత ఇండియా మహిళలు తొలి వికెట్ కు 55పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. షఫాలీ వర్మ 20పరుగులు చేసి ఔటయ్యింది. స్కోరు 77 వద్ద దయాలన్ హేమలత (9)పెవిలియన్ చేరింది. మరో ఓపెనర్ స్మృతి మందానా – కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లు మరో వికెట్ పడకుండా జట్టును విజయ పథంలో నడిపించారు. మందానా -79; హర్మన్-29 పరుగులతో అజేయంగా నిలిచారు.

స్మృతి మందానా కే ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

మూడు టి 20ల సిరీస్ ప్రస్తుతం 1-1 తో సమం అయ్యింది. మూడో మ్యాచ్ బ్రిస్టల్ లో రేపు గురువారం జరగనుంది.

Also Read : England(W) Vs India(W) : తొలి టి20లో ఇంగ్లాండ్ విజయం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్