Saturday, September 21, 2024
Homeసినిమాతెలుగులో మొట్టమొదటి సూపర్ గర్ల్ మూవీ 'ఇంద్రాణి'

తెలుగులో మొట్టమొదటి సూపర్ గర్ల్ మూవీ ‘ఇంద్రాణి’

Indrani: వెరోనికా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై స్టాన్లీ సుమన్ బాబు నిర్మాణ సారథ్యంలో తెలుగు తెరకు స్టీఫెన్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించనున్న అడ్వెంచర్ మూవీ ‘ఇంద్రాణి’. తెలుగు తెర పై గతంలో ఎన్నడూ చూడని డిఫరెంట్ పాయింట్ ఎంచుకొని ఈ సినిమాను రూపొందించనున్నారు. యాక్షన్ సన్నివేశాలకు తోడు కమర్షియల్ హంగులు జోడించి ఓ సూపర్ గర్ల్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు.

ఓ కెప్టెన్ మార్వెల్, ఓ వండర్ విమెన్ లాంటి క్యారెక్టర్‌తో రంగంలోకి దిగబోతోంది ఇంద్రాణి. వినూత్న ప్రయోగంతో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. లీడ్ రోల్ పోషిస్తున్న హీరోయిన్‌కి సూపర్ పవర్ ఉంటుందట. ఆమెతో పాటు కథ అంతా ట్రావెల్ చేసే మరో ఇద్దరు హీరోయిన్లకు ఈ సినిమాలో స్కోప్ ఉందని దర్శకనిర్మాతలు చెప్పారు. ఇండియన్ సినిమా ఇప్పటిదాకా టచ్ చేయని కథను ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని అన్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న స్టీఫెన్.. న్యూయార్క్ ఫిలిం అకాడమీలో ట్రైనింగ్ చేసి అక్కడే రెండున్నర సంవత్సరాల పాటు స్క్రిప్ట్ పై కసరత్తులు చేసి స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి.? చాలా గ్రాండ్‌గా VFX వర్క్ ఎలా జరగాలి.? అనేదాని పై ఓ అంచనాకు వచ్చారు.

ఆతర్వాత ఇండియాలో మరో మూడు నెలలు రీసెర్చ్ చేసి సూపర్ అవుట్‌పుట్‌ని ఆడియన్స్ ముందు ఉంచడమే లక్ష్యంగా ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, బ్యానర్ నేమ్ రిజిస్టర్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫినిష్ చేశారు. షూటింగ్‌కి సంబంధించిన షెడ్యూల్స్ పై ప్రణాళిక రచించి రెడీగా ఉన్నారు దర్శకనిర్మాతలు. సాయి కార్తీక్ అందించబోతున్న మ్యూజిక్ సినిమాలో హైలైట్ కానుందని.. అతిత్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటిస్తామని అన్నారు.

Also Read : సంపూర్ణేష్ బాబు ‘ధగడ్ సాంబ’ సాంగ్ చిత్రీకరణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్