Sunday, January 19, 2025
HomeTrending Newsఐఎన్ఎస్ విక్రాంత్ జాతికి అంకితం

ఐఎన్ఎస్ విక్రాంత్ జాతికి అంకితం

Ins Vikrant : భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చచేసే ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక యుద్ధనౌకను ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (సెప్టెంబర్ 2) ప్రారంభించారు. కేరళలోని కొచ్చి షిప్ యార్డ్‌లో ఉదయం 9.30 గంటలకు ప్రధాని మోదీ ఐఎన్ఎస్‌ విక్రాంత్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. భారత్ మొట్టమొదటిసారి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ విమాన వాహక నౌక నేటి నుంచి నావికా దళంలో ముఖ్య భూమిక పోషించనుంది. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు చైనా దూకుడుగా ముందుకెళ్తున్న తరుణంలో ఐఎన్ఎస్ విక్రాంత్ భారత అమ్ములపొదిలో చేరడం దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది.

550 సంస్థలు, 100 ఎంఎస్‌ఎంఈల భాగస్వామ్యం
కేరళలోని కొచ్చి షిప్‌యార్డ్‌లో 2005లో విక్రాంత్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. నేవీ అంతర్గతసంస్థ అయిన వార్‌ షిప్‌ డిజైన్‌ బ్యూరో (డబ్ల్యూడీబీ) దీన్ని రూపొందించింది. 2009 నుంచి మొదలైన పూర్తిస్థాయి నిర్మాణం 13 ఏళ్లలో పూర్తయింది. బీఈఎల్, భెల్, స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, జిందాల్, ఎస్‌ఆర్‌ గ్రూప్, మిథానీ, జీఆర్‌ఎస్‌ఈ, కెల్‌ట్రాన్, కిర్లోస్కర్, ఎల్‌ అండ్‌ టీ మొదలైన 550 దిగ్గజ పరిశ్రమలతో పాటు 100కు పైగా ఎంఎస్‌ఎంఈలు నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. పరికరాలు, యంత్రాలన్నీ దాదాపుగా స్వదేశీ తయారీవే. 23 వేల టన్నుల ఉక్కు, 2,500 కి.మీ. ఎలక్ట్రిక్‌ కేబుల్స్, 150 కి.మీ. పైపులు, 2 వేల వాల్వులు, గ్యాలీ పరికరాలు, ఎయిర్‌ కండిషనింగ్, రిఫ్రిజిరేషన్‌ ప్లాంట్లు, స్టీరింగ్‌ గేర్స్‌ వంటివన్నీ స్వదేశీయంగా తయారు చేసినవే. కొన్ని భాగాలను మాత్రం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారు. రెండువేల మంది షిప్‌యార్డు అధికారులు, సిబ్బంది, 13 వేలమంది కార్మికులు, ఉద్యోగులు విక్రాంత్‌ నిర్మాణంలో భాగస్వాములు. నౌక నిర్మాణం జరిగిన 13 ఏళ్ల పాటు రోజూ 2 వేల మందికి ఉపాధి దొరికింది. పరోక్షంగా పలు తయారీ సంస్థల్లో 40 వేల మందికి ఉపాధి లభించింది. 42,8000 టన్నుల సామర్థ్యంతో రెండు టేకాఫ్‌ రన్‌వేలు, ఒక ల్యాండింగ్‌ స్ట్రిప్‌లతో క్షిపణి దాడిని తట్టుకునేలా నిర్మించారు. రూ.20 వేల కోట్లు ఖర్చయియింది. గత ఏడాది ట్రయల్స్‌ విజయవంతంగా ముగిశాయి.

ఎందుకంత కీలకం?
రక్షణపరంగా, రవాణాపరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో పైచేయి సాధించేందుకు ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ మనకు బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడనుంది. ఏ దేశానికైనా  యుద్ధ విమానాలను మోసుకుపోగలిగే సామర్థ్యం కలిగిన నౌకలు ఉంటే నావికాశక్తి పటిష్టంగా ఉంటుంది. దీంతో సముద్ర జలాల్లోనూ, గగన తలంపై కూడా పట్టు సాధించగలం. చైనా దగ్గర రెండు విమాన వాహక నౌకలు, 355 యుద్ధ నౌకలు, 48 విధ్వంసక నౌకలు, 43 ఫ్రిజెట్లు, 61 కార్వెట్లున్నాయి. మూడో విమాన వాహక నౌక తయారీ కూడా మొదలైంది. మనకు మాత్రం ఇప్పటిదాకా విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య మాత్రమే ఉంది. 10 విధ్వంసక నౌకలు, 12 ఫ్రిగేట్లు, 20 కార్వెట్లున్నాయి. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ రాకతో బంగాళాఖాతం, అరేబియా సముద్ర జలాలపై మన పట్టు మరింత బిగుస్తుంది. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే అత్యాధునిక వ్యవస్థ ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సొంతం.

Also Read : ఐఎన్‌ఎస్‌ యుద్ధనౌక విశాఖకు గర్వకారణం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్