Saturday, January 18, 2025
HomeసినిమాVijay, Sandeep: మరోసారి అర్జున్ రెడ్డి కాంబో మూవీ..?

Vijay, Sandeep: మరోసారి అర్జున్ రెడ్డి కాంబో మూవీ..?

‘అర్జున్ రెడ్డి’ సినిమా ఓ సంచలనం. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఇద్దరికీ మంచి పేరును అలాగే యూత్ లో మంచి క్రేజ్ ను తీసుకువచ్చింది. ఈ సినిమా తర్వాత విజయ్, సందీప్ ఇద్దరూ తమ తమ సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేస్తే.. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ సాధించడం విశేషం. దీంతో సందీప్ రెడ్డి వంగతో సినిమాలు చేసేందుకు టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు మాత్రమే కాదు.. బాలీవుడ్ హీరోలు, ప్రొడ్యూసర్స్ కూడా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘ఖుషి’. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఏర్పాటు చేశారు. ఇందులో విజయ్ తో మళ్లీ సినిమా చేయాలి అంటే ఎవరి డైరెక్షన్ లో మూవీని నిర్మిస్తారని ఓ అభిమాని అడిగారు. దీనికి మైత్రీ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ స్పందించారు. విజయ్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో మూవీ చేయాలని వుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ కాంబినేషన్ లో మూవీ ఉంటుందని చెప్పారు. దీంతో అర్జున్ రెడ్డి కాంబో ఫిక్స్ అయ్యిందని ప్రచారం మొదలైంది. అయితే.. ఈ కాంబో మూవీ ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్