Sunday, January 19, 2025
Homeసినిమామహేష్‌ మూవీ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్

మహేష్‌ మూవీ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందే సినిమా గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ ఇయర్ ఎండింగ్ లో ఈ సినిమాకి సంబంధించి వర్క్ షాపు స్టార్ట్ చేసి… జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. భారీ అడ్వెంచర్ యాక్షన్ మూవీ ఈ సినిమా ఉంటుందని సమాచారం.  ఆర్ఆర్ఆర్ మూవీతో ఇంటర్నేషనల్ గా రాజమౌళికి పేరు రావడంతో ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ మూవీగా ప్లాన్ చేస్తున్నారు.

అయితే.. ఈ సినిమా ఇంకా స్టార్ట్ కాలేదు కానీ.. గత కొంత కాలంగా ఈ మూవీకి సంబంధించి ఏదో వార్త ప్రచారంలోకి వస్తూనే ఉంది. ఇందులో విలన్ గా అమీర్ ఖాన్ నటించనున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. దీని పై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే.. ఈ సినిమా గురించి రైటర్ విజయేంద్రప్రసాద్ ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. కథ ఇంకా పూర్తి కాలేదు. జులై ఎండింగ్ కి కంప్లీట్ అవుతుంది. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే.. ప్రేక్షకుల ఊహకే వదిలేసేలా.. పార్ట్ 2 చేసే అవకాశం ఉండేలా రాస్తున్నట్టుగా తెలియచేశారు.

మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9న ఈ చిత్రాన్ని అనౌన్స్ చేయనున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. మరి కొద్ది రోజుల్లో ఈ వార్త పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో దీపికా పడుకునే నటించనున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి కానీ.. ఇంకా నటీనటులు ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్