Sunday, January 19, 2025
HomeసినిమాAgent Movie Villain Dino Morea: 'ఏజెంట్' నుంచి ‘ది గాడ్’ గా డినో మోరియా...

Agent Movie Villain Dino Morea: ‘ఏజెంట్’ నుంచి ‘ది గాడ్’ గా డినో మోరియా లుక్ రిలీజ్

అఖిల్, సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’.సాక్షి వైద్య అఖిల్ కు జోడిగా కనిపిస్తుండగా,మమ్ముట్టి కీలక పాత్ర పోషించడం విశేషం. ఈ రోజు ఏజెంట్ మూవీ నుంచి డినో మోరియాను ‘ది గాడ్’ గా పరిచయం చేశారు. రాజ్, అక్సర్, జూలీ మొదలైన చిత్రాలలో నటించి మెప్పించిన బాలీవుడ్ స్టార్ డినో మోరియా..చేతిలో మెషిన్ గన్‌తో పోస్టర్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. అతని పొడవాటి జుట్టు, నెరిసిన గడ్డం , ముఖం మీద గాయాలు ఈ పాత్రను మరింత డెడ్లీ గా ప్రజెంట్ చేస్తున్నాయి.

మొదటి, రెండు పాటల్లానే నిన్న విడుదలైన మూడో పాట రామాకృష్ణ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. హిప్ హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్. ఏప్రిల్ 28న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏజెంట్ చిత్రం విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్