జమ్ము కాశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత పరిశ్రమల రాక పెరిగింది. రాష్ట్ర విభజన, శాంతి భద్రతలు అదుపులోకి రావటంతో దేశీయ పారిశ్రామికవేత్తలతో పాటు విదేశీ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. కాశ్మీర్ లోయలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే లులు గ్రూప్, అపోలో, ఏమార్, జిందాల్ తదితర సంస్థలు సన్నాహాలు ప్రారంభించాయి. వీటికి తోడు గల్ఫ్ దేశాలకు చెందిన అల్ మాయ గ్రూప్, మటు ఇన్వెస్ట్మెంట్స్ LLC, జిఎల్ ఎంప్లాయిమెంట్ బ్రోకరేజ్, సెంచురీ ఫైనాన్స్, నూన్ ఈ కామర్స్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపాయి. 2021 సంవత్సరంలో 2.5 బిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులు కాశ్మీర్ వచ్చాయి.
ప్రధానమంత్రి స్వయంగా రాష్ట్రంలో పెట్టుబడులను పోత్సహిస్తుండటం, ప్రధానమంత్రి పర్యవేక్షణలో పారిశ్రామిక వేత్తల అనుమానాలు తీరుస్తున్నారు.
దీంతో ఇప్పటివరకు 38 వేల కోట్ల పెట్టుబడులు వివిధ రూపాల్లో కాశ్మీర్ కు వచ్చాయి. వీటికి తోడి జీ-20 దేశాల సమావేశాన్ని కాశ్మీర్ వేదికగా నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. డిసెంబరు 1, 2022 నుంచి నవంబరు 30, 2023 వరకు జీ-20కి భారత్ ఛైర్మన్‌గా వ్యవహరించనుంది. దీనిలో భాగంగానే జీ-20 సదస్సుకు భారత్ ఆతిథ్యం వహించనుంది. దీంతో ఈ అంశం అంతర్జాతీయంగా చర్చనీయంశంగా మారింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ-20 దేశాల సదస్సుకు విదేశీ వ్యవహారాల శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత కొత్త పారిశ్రామిక చట్టం తీసుకు వచ్చారు. ఈ చట్టం 2037 వరకు అమలోలో ఉంటుంది. ప్రధానమంత్రి గ్రామీన్ సడక్ యోజన కింద సుమారు 2,402 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగిందని కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు.రాష్ట్రంలోని 12 వేల కిలోమీటర్ల జాతీయ రహదార్లను ఆధునీకరించినట్టు గవర్నర్ పేర్కొన్నారు. దీంతో పర్యాటక రంగం పుంజుకుంటోంది.
370 ఆర్టికల్ రద్దు కావటంతో సుమారు 250 రకాల రాష్ట్ర చట్టాలు కాల గర్భంలో కలిశాయి. సుమారు 890 చట్టాలు అమలులోకి వచ్చాయి. రాష్ట్రానికి చెందిన మరో 130 చట్టాలకు సవరణలు జరిగాయి. దీంతో స్థానికత పేరుతో గుత్తాధిపత్యం చేస్తున్న కొన్ని కుటుంబాలకు చెంప పెట్టుగా మారింది. ముఖ్యంగా ఫారుఖ్ అభ్డుల్ల కుటుంబం, ముఫ్తీ మహమూద్ సయీద్ కుటుంబంతో పాటు జమ్ము కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF)కు నాయకత్వం వహించిన నాయకులు వారి స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారు. భారత దేశంలోని మిగతా రాష్ట్రాల ప్రజలు రాకుండా అడ్డుకున్నారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత గుత్తాదిపత్యం తగ్గి అందరికి అవకాశాలు వస్తున్నాయి.