Wednesday, March 26, 2025
Homeస్పోర్ట్స్బెంగుళూరులో ఐపీఎల్ వేలం

బెంగుళూరులో ఐపీఎల్ వేలం

IPL Auction: ఐపీఎల్ వేలం పాట ఈసారి బెంగుళూరులో ఫిబ్రవరి 12, 13తేదీల్లో జరగనుంది. ఈ వేలంపాటలో మొత్తం 590 మంది ఆటగాళ్ళు అందుబాటులో ఉన్నారు. ఆటగాళ్ళ జాబితాను బిసిసిఐ అధికారులు నేడు ఐపీఎల్ ప్రాంచైజీ లకు పంపింది.ఈ 590 ఆటగాళ్ళలో228 మంది ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉన్న వారు కాగా 355 మంది కొత్త వారు, మరో ఏడుగురు అసోసియేట్ నేషన్స్ కు చెందినవారు.

ఈ ఏడు వేలానికి వెళుతున్న వారిలో స్టార్ ఆటగాళ్ళు శిఖర్ ధావన్, షమీ, డూప్లెసిస్, డేవిడ్ వార్నర్, పాట్ కమ్మిన్స్, రవిచంద్రన్ అశ్విన్, డికాక్, శ్రేయాస్ అయ్యర్, ట్రెంట్ బౌల్ట్, రబడ ఉన్నారు. వీరంతా 2 కోట్ల రూపాయల మినిమం బేస్ ప్రైస్ లో ఉన్నారు.

ఈసారి సీజన్ లో గతంలో పాల్గొన్న ఎనిమిది జట్లు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ లెవెన్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తో పాటు కొత్తగా లక్నో సూపర్ జెయింట్స్, టీమ్ అహ్మదాబాద్ లు కొత్త ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయి.

Also Read : ప్రొ కబడ్డీ: గుజరాత్, ఢిల్లీ విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్