Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్చెన్నై పై ఢిల్లీ గెలుపు

చెన్నై పై ఢిల్లీ గెలుపు

ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాదించింది. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెల్చుకున్న ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సూపర్ ఫామ్ లో ఉన్న చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డూప్లెసిస్ లు ఈ మ్యాచ్ లో త్వరగా ఔటయ్యారు. చెన్నై ఆటగాళ్ళలో అంబటి రాయుడు-55 (43బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) రాణించాడు. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన రాబిన్ ఊతప్ప-19, కెప్టెన్ ధోనీ-18  పరుగులతో  పర్వాలేదనిపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో అక్సర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టగా, నార్జ్, ఆవేష్ ఖాన్, రవిచంద్ర అశ్విన్ లకు తలా ఒక వికెట్ దక్కింది.

చెన్నై బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఢిల్లీ కూడా లక్ష్య ఛేదనలో ఆపసోపాలు పడాల్సి వచ్చింది. ఓపెనర్ శిఖర్ ధావన్-39 (35 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు); చివర్లో హెట్మెయిర్-28 నాటౌట్ (18బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్) రాణించడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లతో విజయం సాధించింది. చెన్నై బౌలర్లో శార్దూల్ ఠాకూర్­, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు, దీపక్ చాహర్, హాజెల్ వుడ్, బ్రావో తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఇద్దరు కీలక చెన్నై బ్యాట్స్ మెన్ ను అవుట్ చేసిన ఢిల్లీ బౌలర్ అక్సర్ పటేల్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది

RELATED ARTICLES

Most Popular

న్యూస్