ప్రత్యర్థులకు భారీ లక్ష్యం ఇచ్చి విజయం సాధిస్తూ వస్తోన్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఛేజింగ్ లో మాత్రం తడబడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ తో నేడు జరిగిన మ్యాచ్ లో ఆ తట్టు ఇచ్చిన 213 పరుగులను ఛేదించలేక 78 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచిన హైదరాబాద్ ఫీల్డింగ్ ఎంచుకుంది. చెన్నై ఓపెనర్ అజింక్యా రెహానే (9) జట్టు స్కోరు 19 వద్ద ఔటయ్యాడు. రెండో వికెట్ కు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డెరిల్ మిచెల్ లు 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రుతురాజ్ 54 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 98 ; మిచెల్ 32 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 52 పరుగులు చేసి ఔట్ కాగా, శివమ్ దూబే 20 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 39; ధోనీ 5 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది.
ఆ తర్వాత హైదరాబాద్ 21 పరుగుల వద్ద రెండు వికెట్లు (ట్రావిస్ హెడ్ -13; అన్మోల్ ప్రీత్ సింగ్ డకౌట్) కోల్పోయింది. సరైన భాగస్వామ్యం నమోదు చేయడంలో విఫలమై వరుస వికెట్లు సమర్పించుకుంది. మార్ క్రమ్-32; క్లాసేన్-20; అబ్దుల్ సదం-19; నితీష్ కుమార్ రెడ్డి-15 మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. 18.5 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 4; ముస్తాఫిజుర్ రెహ్మాన్, పతిరణ చెరో 2; జడేజా, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు.
రుతురాజ్ గైక్వాడ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.