Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్IPL: ఉత్కంఠ పోరులో పంజాబ్ దే విజయం

IPL: ఉత్కంఠ పోరులో పంజాబ్ దే విజయం

ఐపీఎల్ లో నేడు జరిగిన ఉత్కంఠభరిత  మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై పంజాబ్ కింగ్స్ 5 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 197 పరుగులు చేయగా… లక్ష్య సాధనలో రాజస్థాన్ ఏడు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేయగలిగింది.

గౌహతి లోని బసరప్ప స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ తొలి వికెట్ కు 90 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ప్రభ్ సిమ్రాన్ 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి ఔటయ్యాడు. రాజపక్ష రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరగ్గా, జితేష్ శర్మ 27 రన్స్ చేశాడు. కెప్టెన్ ధావన్ 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 197 పరుగులు చేసింది.

రాజస్థాన్ బౌలర్లలో హోల్డర్ 2, అశ్విన్, చాహల్ చెరో వికెట్ సాధించారు.

రాజస్థాన్ లో అశ్విన్ ఓపెనర్ గా బరిలోకి దిగి డకౌట్ అయ్యాడు. అంతకు ముందే మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (11) పెవిలియన్ చేరాడు. జోస్ బట్లర్ -42,  దేవదత్ పడిక్కల్-21; రియాన్ పరాగ్-20; జోస్ బట్లర్ -19 పరుగులు చేశారు.  ఈ దశలో షిమ్రాన్ హెట్మెయిర్-ధృవ్ జురెల్ లు ధాటిగా ఆడి జట్టును విజయం అంచుల వరకూ తీసుకెళ్ళారు. చివరి ఓవర్లో హెట్మెయిర్-36 (18 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) రనౌట్ కావడంతో పింకీస్ ఆశలు ఆవిరయ్యాయి. జురెల్ 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల తో 32 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

నాథన్ ఎల్లిస్ నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు. అర్ష్ దీప్ కు రెండు వికెట్లు దక్కాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్