Friday, July 5, 2024
Homeస్పోర్ట్స్IPL: సాగర తీరంలో సునీల్ పరుగుల సునామీ

IPL: సాగర తీరంలో సునీల్ పరుగుల సునామీ

విశాఖ సాగర తీరంలో కోల్ కతా నైట్ రైడర్స్ – ఢిల్లీ కాపిటల్స్ మధ్య నేడు జరిగిన మ్యాచ్ లో కోల్ కతా 106 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. టాస్ గెలిచిన కోల్ కతా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ సునీల్ నరైన్ పరుగుల సునామీ సృష్టించాడు. 39 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 85 పరుగులు చేసి ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. సునీల్ తో పాటు ఆండ్రీ రస్సెల్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 41; రఘువంశీ  27 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 54; రింకూ సింగ్ 8 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్ తో 26; ఫిల్ సాల్ట్ 18; కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 18 పరుగులతో సత్తా చాటడంతో నిర్ణీత  20 ఓవర్లలో 272 పరుగుల రికార్డు స్కోరు చేసింది.

ఢిల్లీ బౌలర్లలో నార్త్జ్ 3; ఇషాంత్ శర్మ 2, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ చెరో వివేక్ట్ పడగొట్టారు.

భారీ లక్ష్య సాధనలో ఢిల్లీ 33 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 18; పృథ్వీ షా; రన్స్ చేయగా మిచెల్ మార్ష్, అభిషేక్ పోరెల్ డకౌట్ గా వెనుదిరిగారు. కెప్టెన్ రిషభ్ పంత్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 55; స్టబ్స్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54… మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. 17. 2 ఓవర్లలో 166 పరుగులకే ఢిల్లీ ఆలౌట్ అయ్యింది.

కోల్ కతా బౌలర్లలో వైభవ అరోరా, వరుణ్ చక్రవర్తి చెరో 3; మిచెల్ స్టార్క్ 2; ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ చెరో వికెట్ పడగొట్టారు.

సునీల్ నరైన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

ఇదే సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 277 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్