నక్కిన త్రినాథరావు. రవితేజ కెరీర్ లోనే ‘ధమాకా’ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే… చిరంజీవికి నక్కిన త్రినాథరావు కథ చెప్పారని.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా చేయనున్నారని వార్తలు వచ్చాయి. దీంతో నక్కిన నెక్ట్స్ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. యువ హీరో నాగశౌర్య నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ లో నక్కిన త్రినాథరావు సినిమా చేయనున్నట్టుగా ప్రకటించారు.
త్రినాధరావు నక్కినతో చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ఉషా ముల్పూరి, శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 5 దర్శక, నిర్మాతలకు అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కానుంది. ఈ రోజు ఉగాది సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా అనౌన్స్ చేశారు. అయితే.. ఈ సినిమాలో హీరో ఎవరు అనేది అనౌన్స్ చేయలేదు. దీంతో నక్కిన త్రినాధరావు డైరెక్షన్ లో ఐరా క్రియేషన్స్ నిర్మించే ఈ సినిమాలో హీరో ఎవరు అనేది హాట్ టాపిక్ అయ్యింది. ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామన్నారు మేకర్స్.