Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్ICC WC Qualifiers: ఎమిరేట్స్ పై ఐర్లాండ్ గెలుపు

ICC WC Qualifiers: ఎమిరేట్స్ పై ఐర్లాండ్ గెలుపు

ఐసిసి వరల్డ్ కప్-2023 క్వాలిఫైర్ టోర్నీ లో లీగ దశ నేటితో ముగిసింది. ఐర్లాండ్- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య బులావాయో అథ్లెటిక్స్ క్లబ్ లో నేడు జరిగన మ్యాచ్ లో ఐర్లాండ్ 138 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఎమిరేట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 134  బంతుల్లో 15 ఫోర్లు, 8 సిక్సర్లతో 162; కెప్టెన్ బాల్బిర్నీ66; హ్యారీ టెక్టర్-57 రన్స్ తో సత్తా చాటారు. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 349 పరుగులు చేసింది. ఎమిరేట్స్ బౌలర్లలో సంచిత్ శర్మ 3;  అలీ నాసర్ ఒక వికెట్ పడగొట్టారు.

లక్ష్య సాధనలో ఎమిరేట్స్ 39 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ముహమ్మద్ వసీమ్-45; సంచిత్ శర్మ-44, బాసిల్ హమీద్-39 మాత్రమే రాణించారు.

ఐర్లాండ్ బౌలర్లలో జోసువా లిటిల్, అండీ మెక్ బ్రైన్, జార్జ్ డాక్రెల్, కర్టిస్ కాంపర్ తలా రెండు; బ్యారీ మెక్ కార్తీ ఒక వికెట్ పడగొట్టారు.

సెంచరీ సాధించిన పాల్ స్టిర్లింగ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్