Friday, September 20, 2024
Homeస్పోర్ట్స్ICC WC Qualifiers: అమెరికాపై ఐర్లాండ్ ఘన విజయం

ICC WC Qualifiers: అమెరికాపై ఐర్లాండ్ ఘన విజయం

ఐసిసి క్వాలిఫైర్స్ సూపర్ సిక్స్ దశలో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో అమెరికాపై ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.  తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా 42.4 ఓవర్లలో 196 పరుగులు చేయగా,  ఈ లక్ష్యాన్ని 34.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 197 పరుగులు చేసి విజయం సాధించింది.

అమెరికా బ్యాట్స్ మెన్ సుశాంత్ మోదాని-55; ముక్కమల్ల సాయి తేజ-55; ఉస్మాన్ రఫీక్-28; స్టీవెన్ టేలర్-23  పరుగులు చేశారు.

ఐర్లాండ్ బౌలర్లలో క్రెగ్ యంగ్ 3; మార్క్ అడైర్, బ్యారీ మెక్ కార్తీ, అండీ మెక్ బ్రైన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

తొలి వికెట్ కు ఐర్లాండ్ 84 రన్స్ చేసింది. పాల్ స్టిర్లింగ్-58; కెప్టెన్ ఆండ్రీ బాల్బిర్నీ-45 (నాటౌట్); అండీ మెక్ బ్రైన్-35; హ్యారీ టెక్టార్-25; లోర్కాన్ టకర్-25 పరుగులు చేసి జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.

అమెరికా బౌలర్లలో నోస్తుస్ కేంజిగే 2; అభిషేక్ పరాడ్కర్, నిసర్గ్ పటేల్ చెరో ఒక వికెట్ పడగొట్టారు.

క్రెగ్ యంగ్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్