Saturday, January 18, 2025
Homeసినిమాచ‌ర‌ణ్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నారా..?

చ‌ర‌ణ్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్నారా..?

Triple role:  మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇది చ‌ర‌ణ్ 15వ చిత్రం కాగా దిల్ రాజు 50వ చిత్రం కావ‌డం విశేషం. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న ఈ సినిమా ఇటీవల వైజాగ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

మేట‌ర్ ఏంటంటే… ఈ చిత్రం చ‌ర‌ణ్ ద్విపాత్రాభియం చేస్తున్నట్టుగా ఇప్ప‌టి వ‌ర‌కు వార్తలు వ‌చ్చాయి. అయితే.. ఇందులో చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం కాదు.. త్రిపాత్రాభినయం చేస్తున్నాడ‌ట‌. మ‌రో విష‌యం ఏంటంటే.. ఆ మూడు పాత్ర‌ల్లో ఒక పాత్ర పూర్తి నెగెటివ్ గా ఉంటుందని తెలుస్తోంది. అలాగే తండ్రి, ఇద్ద‌రు కొడుకులు పాత్ర‌ల్లో చ‌ర‌ణ్ న‌టిస్తున్నాడ‌ట‌. కొడుకుల్లో ఒకరిని గ్రే షేడ్ పాత్రగా మలిచారని తెలుస్తోంది. ఆ ఇద్దరిలో ఒకరు విలన్ కాగా, తండ్రి పాత్ర సివిల్ సర్వెంట్ అని టాక్.

ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలిచిపోతుందని సమాచారం. సాధారణంగా శంకర్ చిత్రాల్లో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. కొన్ని చిత్రాల్లో  హీరో కన్నా విలన్‌నే పవర్ ఫుల్ గా చూపించారు శంకర్. దీన్ని బట్టి.. చరణ్ పాత్ర‌కు ప‌ర్ ఫార్మెన్స్ కు చాలా స్కోప్ ఉంటుంద‌ని తెలుస్తోంది. ప్ర‌చారంలో ఉన్న‌ది నిజ‌మైతే.. చ‌ర‌ణ్ త్రిపాత్రాభిన‌యం చేస్తే.. అభిమానుల‌కు పండ‌గే.

Also Read : చ‌ర‌ణ్‌, శంక‌ర్ మూవీ లేటెస్ట్ అప్ డేట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్