Saturday, January 18, 2025
Homeసినిమామోహన్ రాజా ఖాయమేనా?

మోహన్ రాజా ఖాయమేనా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న భారీ చిత్రం ఆచార్య. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. కరోనా సెకండ్ వేవ్ లేకుండా ఉంటే.. ఇప్పటికే ఆచార్య సినిమా విడుదలై ఉండేది. ఈ సినిమా తర్వాత చిరంజీవి మలయాళంలో విజయం సాధించిన లూసీఫర్ మూవీని తెలుగులో రీమేక్ చేయాలి అనుకున్నారు. ఈ రీమేక్ కి ముందుగా సుకుమార్ అయితే బాగుంటుంది అనుకున్నారు. అయితే.. సుకుమార్ రీమేక్ ని డైరెక్ట్ చేయనని సున్నితంగా చెప్పి తప్పుకున్నారు. ఆతర్వాత సాహో డైరెక్టర్ సుజిత్ కి బాధ్యతలు అప్పగించారు.

సుజిత్ లూసీఫర్ రీమేక్ పై వర్క్ చేసిన తర్వాత అతను కూడా తప్పుకున్నాడు. ఆతర్వాత డైనమిక్ డైరెక్టర్ వినాయక్ కి ఆ బాధ్యతలు అప్పగించారు. వినాయక్ తన టీమ్ తో వర్క్ చేశారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారు. ఈ మార్పులు చేర్పులు చిరంజీవికి సంతృప్తి కలిగించకపోవడంతో వినాయక్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆఖరికి లూసీఫర్ రీమేక్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ మోహన్ రాజాకి వచ్చింది. ఈ మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించడం కూడా జరిగింది. అయితే.. ఇటీవల మోహన్ రాజా చేసిన మార్పులు కూడా చిరంజీవికి నచ్చలేదని.. అందుకని మోహన్ రాజా కూడా తప్పుకున్నారని వార్తలు వచ్చాయి.

చిరంజీవి అండ్ టీమ్ మ‌రో ద‌ర్‌ కుడిని వెతికే ప‌నిలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ప్రచారంలో ఉన్న ఈ వార్త నిజమేనా.? కాదా..? అని తెలుసుకుంటే.. ప్రచారంలో ఉన్న ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని తెలిసింది. డైలాగ్ వెర్ష‌న్ కూడా పూర్త‌య్యింద‌ని.. ఇటీవల చిరు, మోహన్ రాజా కలిసి ఈ స్ర్కిప్ట్ చర్చించారని తెలిసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే జులై నుంచి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్నారని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్