Sunday, January 19, 2025
Homeసినిమాపోకిరి రికార్డ్ ను జ‌ల్సా బ్రేక్ చేస్తుందా..?

పోకిరి రికార్డ్ ను జ‌ల్సా బ్రేక్ చేస్తుందా..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం పోకిరి. ఈ సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. మ‌హేష్‌, పూరి కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని చిత్రాల్లో ఒక‌టిగా నిలిచింది. మ‌హేష్ కి మాస్ లో క్రేజ్ తీసుకువ‌చ్చిన సినిమ అంటే.. అంద‌రూ ఠ‌క్కున చెప్పేది ‘పోకిరి’  గురించే.

సినీ అభిమానుల‌కు అంత‌లా న‌చ్చింది క‌నుక‌నే మ‌హేష్ బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా  ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవ‌ర్ సీస్ లో కూడా రిలీజ్ చేశారు. ముందుగా హైద‌రాబాద్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. బాగా డిమాండ్ రావ‌డంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. 375కు పైగా షోస్ వేశారంటే.. ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ విధంగా పోకిరి కొత్త రికార్డ్ సెట్ చేసింది.

అయితే.. ప‌వ‌ర్ స్టార్ పుట్టిన‌రోజు సెప్టెంబ‌ర్ 2న‌. ఈ సంద‌ర్భంగా ప‌వ‌ర్ స్టార్ అభిమానులు జ‌ల్సా చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్ లో రూపొందిన జ‌ల్సా చిత్రాన్ని గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అప్ గ్రేడ్ చేసిన కొత్త ప్రింట్ తో షో కావాలని పవన్ ఫ్యాన్స్ డిమాండ్ చెయ్యగా సినిమా నిర్మాతలు మెగా కాంపౌండ్ కూడా ఈ సినిమా పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. మ‌రి.. పోకిరి 375 కు పైగా షోస్ వేశారు ఈ రికార్డ్ ను జ‌ల్సా బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

Also Read :  సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న పోకిరి

RELATED ARTICLES

Most Popular

న్యూస్