Saturday, January 18, 2025
Homeసినిమాజాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఈసారైనా నిజమయ్యేనా?

జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఈసారైనా నిజమయ్యేనా?

Is it?: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ను గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. బాలీవుడ్ కి ఈ బ్యూటీ పరిచయమై కొంతకాలమవుతోంది. చెప్పుకోదగిన హిట్లు లేకపోయినా .. తన క్రేజ్ తగ్గకుండా చూసుకుంటోంది. పొట్టి బట్టలతో ఎప్పటికప్పుడు కుర్రాళ్లకు కుదురులేకుండా చేస్తూనే ఉంటుంది .. తన గురించి వాళ్ల మధ్య చర్చలు జరిగేలా చూస్తూనే ఉంటుంది. అప్పుడప్పుడు టాలీవుడ్ హీరోల గురించి మాట్లాడుతూ, ఈ బ్యూటీ ఇక్కడి సినిమాలు కూడా చేస్తుందా? అని అందరినీ ఊరిస్తూ ఉంటుంది.

నిజం చెప్పాలంటే జాన్వీ కపూర్ వి చక్కని కళ్లు .. ఆ కళ్ల చుట్టూనే ఆమె కుర్రమనసులను తేనె టీగల మాదిరిగా తిప్పగలదు. తెలుగులో మంచి కథలు .. పాత్రలు పడితే చేయడానికి తన కూతురు రెడీగా ఉందని బోనీ కపూర్ చెప్పిన దగ్గర నుంచి, టాలీవుడ్ లో ఆమె ఎంట్రీ  కోసం అభిమానులు ఒళ్లంతా కళ్లు చేసుకుని చూస్తున్నారు. తెలుగులో ఏ స్టార్ హీరో సినిమా కొత్తగా మొదలైనా, హీరోయిన్ గా ఆమె పేరు వినిపించడమనేది అప్పటి నుంచే మొదలైంది. అలా ఎన్టీఆర్ – కొరటాల సినిమాకి కూడా జాన్వీ పేరు వినిపించింది.

ఇక ఇప్పుడు కూడా ఎన్టీఆర్ ప్రాజెక్టు విషయంలో కథానాయికగా ఆమె పేరునే వినిపిస్తోంది .. కాకపోతే దర్శకుడు ప్రశాంత్ నీల్. కెరియర్ పరంగా ఎన్టీఆర్ కి ఇది 31వ సినిమా. ఇది పాన్ ఇండియా సినిమా .. ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ లో నిర్మితం కానుంది. ఈ సినిమా కోసం ముందుగా దీపికను అనుకున్నారు .. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. దాంతో జాన్వీని సంప్రదించడం ..  ఆమె ఓకే అనడం జరిగిపోయిందని అంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్ ‘తో పెరిగిన ఎన్టీఆర్ క్రేజ్ ..  ప్రశాంత్ నీల్ వైపు నుంచి ఉన్న’కేజీఎఫ్’ రికార్డును చూసుకునే ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటుందనేది టాలీవుడ్ టాక్.

Also Read : ఎన్టీఆర్ స‌ర‌స‌న జాన్వీ క‌పూర్? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్