Saturday, January 18, 2025
Homeసినిమాఎన్టీఆర్.. కొర‌టాల క‌థ‌కు నో చెప్పారా..?

ఎన్టీఆర్.. కొర‌టాల క‌థ‌కు నో చెప్పారా..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప్ర‌క‌ట‌న అయితే వ‌చ్చింది కానీ.. ఇంత వ‌ర‌కు సెట్స్ పైకి రాలేదు. ‘ఆచార్య’ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో కొర‌టాల‌ను క‌థ పై బాగా క‌స‌ర‌త్తు చేయ‌మ‌న్నారు ఎన్టీఆర్. ‘ఆచార్య’ రిలీజ్ త‌ర్వాత నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు క‌థ పై కుస్తీ చేస్తూనే ఉన్నాడు. అంతా అనుకున్నట్టుగా జరిగితే.. ఈ పాటికి నాలుగైదు షెడ్యూల్స్ కూడా పూర్తి చేసుకుని ఉండేది.

అటు ‘ఆర్ఆర్ఆర్’, ఇటు ‘ఆచార్య’ ఎఫెక్ట్ తో కొరటాల పై ప‌డ‌డంతో ఈ ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణమైందని అంటున్నారు సినీ జ‌నాలు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.. కొరటాల ముందుగా చెప్పిన కథ తన పాన్ ఇండియా ఇమేజ్ కి సెట్ కాదని ఎన్టీఆర్ అనుకున్నాడ‌ట‌. అందువల్లనే కొరటాల కొత్త కథను రెడీ చేస్తున్నాడని తెలిసింది. కొరటాల కొత్త కథ నచ్చితేనే ఎన్టీఆర్ సెట్స్ పైకి వస్తాడనేది బయట వినిపిస్తున్న టాక్.

దీనిని బట్టి చూస్తుంటే ఈ ప్రాజెక్టు మరింత ఆల‌స్యం కావడం ఖాయంగానే కనిపిస్తోంది. గతంలో ‘జనతా గ్యారేజ్’ తో ఎన్టీఆర్ కి కొరటాల హిట్ ఇచ్చినప్పటికీ, అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పటి పరిస్థితులు వేరు. అందువల్లనే ఎన్టీఆర్ చెప్పిన‌ట్టుగా స్క్రిప్ట్ విషయంలో కొరటాల ముందుకు వెళుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికలుగా రష్మిక, కీర్తి సురేశ్ పేర్లు వినిపిస్తున్నాయి. ప్ర‌చారంలో ఉన్నట్టుగా న‌వంబ‌ర్ లో ఈ మూవీ సెట్స్ పైకి రావ‌డం లేద‌ని… వచ్చే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం. మ‌రి.. ఎన్టీఆర్ ఎస్ చెబుతాడో.. నో చెబుతాడో.. చూడాలి.

Also Read : ఆచార్య ఎఫెక్ట్.. కొర‌టాల కీల‌క నిర్ణ‌యం..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్