Saturday, January 18, 2025
HomeసినిమాHari Hara Veera Mallu: 'వీరమల్లు'కి వీలవుతుందా అనేదే ఫ్యాన్స్ డౌట్! 

Hari Hara Veera Mallu: ‘వీరమల్లు’కి వీలవుతుందా అనేదే ఫ్యాన్స్ డౌట్! 

పవన్ కల్యాణ్ హీరోగా ‘హరిహర వీరమల్లు’ సెట్స్ పైకి వెళ్లి చాలా కాలమే అయింది. క్రిష్ దర్శకత్వంలో ఎ.ఎమ్. రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో పవన్ లుక్ ఆయన అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. ఆయన ఈ తరహా సినిమా చేయడం ఇదే ఫస్టు టైమ్ కావడంతో, వాళ్లలో ఆసక్తి కూడా పెరిగిపోయింది. చాలా కాలం క్రితమే ఈ సినిమా 50 శాతం చిత్రీకరణ జరుపుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత కోవిడ్ కారణంగా కొంతకాలం పాటు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ఆ తరువాత నుంచి ఈ సినిమా షెడ్యూల్స్ వరుసగా జరిగిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. అప్పుడప్పుడు మాత్రం సెట్స్ లో పవన్ కల్యాణ్ కి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. కానీ ఇంతవరకూ ఈ సినిమా షూటింగు పూర్తి కాలేదు. ఎక్కడ ఆలస్యమవుతుందో .. ఎందుకు ఆలస్యమవుతుందో అనే విషయంలో ఒక క్లారిటీ మాత్రం అభిమానులకు అందడం లేదు. ఈ సినిమా తరువాత పవన్ ఒప్పుకున్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. థియేటర్ల దగ్గర జాతర చేస్తున్నాయి.

సరే .. అవి చిన్న సినిమాలు .. పవన్ తక్కువ రోజులు షూటింగు చేస్తే సరిపోతుంది అనుకుంటే, ఆ తరువాత ప్రాజెక్టులుగా ఆయన ఇప్పుడు చేస్తున్న సుజీత్ .. హరీశ్ శంకర్ సినిమాలు పెద్దవే. అందువల్లనే ‘వీరమల్లు’కు వచ్చిన ఇబ్బంది ఏమిటనేది ఫ్యాన్స్ కి అర్థం కావడం లేదు. భారీ సెట్లు వేయించారు .. కోట్ల రూపాయలు గుమ్మరించారు .. ఆశించిన స్థాయిలో అప్ డేట్స్ రావడం లేదు. డిసెంబర్ 15న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా చెప్పారు. కానీ ఆ రోజున థియేటర్లకు రావడం ‘వీరమల్లు’కి వీలవుతుందా? అనేదే ఫ్యాన్స్ ముందున్న పెద్ద డౌట్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్