Thursday, March 12, 2026
Homeసినిమారాజశేఖర్ మనసు మారేనా?

రాజశేఖర్ మనసు మారేనా?

కెరీర్ ను దృష్టిలో పెట్టుకొని మంచి కథ దొరికితే మల్టీస్టారర్ సినిమాల్లో నటించడానికి నేను సిద్దంగా వున్నాను. అది విలన్ పాత్ర అయినా సరే.. అనే సంకేతాలు ఇంతకు ముందే హీరో రాజశేఖర్ ఇచ్చారు. అప్పటి నుంచి చాలా మంది రాజశేఖర్ ను తమ, తమ సినిమాల్లో నటింపజేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఏవీ ఫలప్రదం కాలేదు. ఈ మధ్య బోయపాటి ‘అఖండ’ సినిమాలో రాజశేఖర్ ను విలన్ గా పరిచయం చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి కానీ.. అది కూడా కార్యరూపం దాల్చలేదు. శ్రీకాంత్ వైపు బోయపాటి మొగ్గు చూపారు.

అయితే.. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న రాజశేఖర్ ఏకంగా రెండు సినిమాలను ప్రకటించారు. రాజశేఖర్ హీరోగా నటించిన ‘గరుడ వేగ’ ఆయనకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ‘కల్కి’ కూడా విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసింది. అందుకే రాజశేఖర్ రెండు సినిమాలను అనౌన్స్ చేశారని సన్నిహితులు చెబుతున్నారు. మరి  హీరోగా రెండు సినిమాలతో బిజీగా వున్న హీరో రాజశేఖర్ ను గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో రూపొందబోతున్న ఓ చిత్రంలోని ముఖ్య పాత్ర కోసం సంప్రదించారని తెలిసింది. వీళ్లు చెప్పే కథైనా రాజశేఖర్ మనసు మార్చి జగపతి బాబు తరహాలో తన కెరీర్ ను హీరో నుంచి విలన్ వైపు మలుపు తిప్పుకుంటారో లేక హీరోగానే కంటిన్యూ చేస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular