Monday, January 20, 2025
Homeఅంతర్జాతీయంఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఐజాక్ హెర్జోగ్

ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా ఐజాక్ హెర్జోగ్

ఇజ్రాయెల్ 11వ అధ్యక్షుడిగా జుయీష్ ఏజెన్సీ ఛైర్మన్, లేబర్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ఎన్నికయ్యారు. మొత్తం 120 మంది సభ్యులకు ఓటు హక్కు ఉండగా ముగ్గురి సభ్యుల ఓట్లు చెల్లలేదు, మరో ముగ్గురు ఓటింగ్ కు రాలేదు, మరొకరు సభకు వచ్చినా ఓటు హక్కు వినియోగించుకోలేదు.

మొత్తం 113 ఓట్లలో హెర్జోగ్ కు 87 ఓట్లు రాగా….ప్రత్యర్ధి, సామాజిక వేత్త మిరియం పెరెజ్ కు 26 ఓట్లు లభించాయి. గెలిచినా అధ్యక్ష అభ్యర్ధికి ఇంత ఎక్కువ సంఖ్యలో ఓట్లు రావడం ఇజ్రాయెల్ చరిత్రలో ఇదే తొలిసారి.
ఐజాక్ హెర్జోగ్ ఇజ్రాయెల్ సీనియర్ రాకీయ నేతల్లో ఒకరు. ఐజాక్ తండ్రి చాయిమ్ హెర్జోగ్ తొలుత ఐరాసలో ఇజ్రాయెల్ రాయబారిగా, అనంతరం దేశ అధ్యక్షుడిగానూ పనిచేశారు. తాత.. దేశంలోని యూదుల తొలి మత గురువు. ఐజాక్ 2013 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ప్రత్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.

ఐజాక్ హెర్జోగ్ కు వ్యతిరేకంగా పోటీచేసిన మిరియం పెరేత్జ్ టేజ్ గొప్ప విద్యావేత్త. ఆమె ఇద్దరు కొడుకులు ఇజ్రాయెల్ ఆర్మీలో పనిచేసి ప్రాణాలు కోల్పోయారు. ఆమె చిన్నప్పుడే కుటుంబం మొరాకో నుంచి ఇజ్రాయెల్ కు వలస వచ్చింది. ఉపాధ్యాయ వృత్తితో దేశానికి ఆమె చేసిన సేవకు గాను దేశ అత్యున్నత పురస్కారం ‘ఇజ్రాయెల్ ప్రైజ్’ లభించింది.

ప్రస్తుత అధ్యక్షుడు రూవెన్ రివ్లిన్ జూలై 9న పదవీ విరమణ చేస్తారు, అదేరోజు హెర్జోగ్ బాధ్యతలు స్వీకరిస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్