గాజాలో జరిగిన తాజా దాడులను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమేన్ నెతన్యాహు సమర్ధించుకున్నారు. ఈ దాడులు మొదలు పెట్టిందే హమాస్ అని, తమ దేశంపై రాకెట్ దాడులు చేసి సామాన్య పౌరులను పొట్టన పేర్కొన్నారు. తాము ఈ చర్యను మధ్యలో వదిలేయలేమని, ఎప్పటివరకూ అవసరమో అప్పటిదాకా తమ దాడులు కొనసాగిస్తామని తేల్చి చెప్పారు.
హమాస్ ఉగ్రవాదులు తమ దేశంలో సాధారణ పౌరులపై కూడా దాడులు జరుపుతున్నారని, కాని తాము మాత్రం పౌర నష్టం జరగకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలపైనే దాడులు చేస్తున్నామని వెల్లడించారు.
ఇజ్రాయెల్ శనివారం నాడు గాజా నగరంలోని మీడియా సంస్థలు ఉన్న అతిపెద్ద భవనమై క్షిపణులతో విరుచుకు పడ్డాయి. 12 అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ భవనంలోనే యుఎస్ అసోసియేటెడ్ ప్రెస్, అల్ జజీరా కార్యాలయాలు ఉన్నాయి.
దీనితోపాటు మరో మరో క్షిపణిని కూడా గాజాపై ఇజ్రాయెల్ ప్రయోగించింది. భవనాన్ని ఖాళీ చేయాల్సిందిగా సాధారణ పౌరులను ఇజ్రాయెల్ బలగాలు హెచ్చరించాయి