Sunday, January 19, 2025
HomeTrending Newsనాణ్యమైన విత్తనాలకు కేరాఫ్ తెలంగాణ - మంత్రి నిరంజన్

నాణ్యమైన విత్తనాలకు కేరాఫ్ తెలంగాణ – మంత్రి నిరంజన్

Ista Congress :  ప్రపంచ ఆకలి తీరాలని, రైతుకు నాణ్యమైన విత్తనం అందాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ప్రపంచంలో 800 మిలియన్ ప్రజలు ఆకలితో బాధపడుతున్నారని, 2 బిలియన్లకు పైగా ప్రజలు పోషకాహారలోపంతో బాధపడుతున్నారని వాపోయారు. ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న ఇస్టా కాంగ్రెస్ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల అనేది అన్ని దేశాలకు అత్యంత ముఖ్యమైనదని, అధిక వ్యవసాయ ఉత్పత్తిని సాధించడానికి నాణ్యమైన విత్తనోత్పత్తి జరగాలన్నారు.

కఠినమైన నాణ్యతా నిబంధనలతో కూడిన విత్తన పరిశ్రమ అన్ని దేశాలకు అవసరమని, 2030 నాటికి జీరో హంగర్ లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. రైతులకు మంచి నాణ్యమైన విత్తనాలు లభించనంత వరకు పరిశోధనలు, రైతుల పంట పెట్టుబడి వృధానే అవుతున్దన్న్నారు. అంతర్జాతీయ సంస్థ అయిన ఇస్టా విత్తన నమూనా మరియు పరీక్షల కోసం ప్రామాణిక పద్ధతులను అభివృద్ధి చేయాలని, విత్తన పరిశోధనను ప్రోత్సహించడం మరియు విత్తన శాస్త్రానికి సంబంధించిన జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యవసాయం, విత్తన పరిశ్రమలు మరియు విత్తన వ్యాపారానికి మద్దతు ఇస్తుందని మంత్రి తెలిపారు. తెలంగాణలో నాణ్యత హామీ వ్యవస్థలను మెరుగుపరచడంలో ఇస్టాతో కలిసి పని చేయడం సంతృప్తినిస్తున్నదన్నారు.

భారత్ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. విభిన్న వాతావరణ పరిస్థితులలో విస్తృత శ్రేణి పంటల సాగు జరుగుతున్నదని మంత్రి వెల్లడించారు.  ప్రపంచ  విత్తన పరిశ్రమ వృద్ధి రేటు 5% అయితే భారతీయ విత్తన పరిశ్రమ వృద్ధి రేటు  12-15%తో ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విత్తన పరిశ్రమలలో భారత్ ఒకటి. 2014 – 15 నుండి 2020 – 21 మధ్యలో తెలంగాణ విత్తన పరిశ్రమ  వృద్ధి రేటు 85 శాతం కావడం విశేషమన్నారు.

2019లో హైదరాబాద్ లో ఇస్టా కాంగ్రెస్ అంతర్జాతీయ సదస్సు తెలంగాణ విత్తనరంగం బలోపేతానికి ఎంతో దోహదం చేసింది. ఈ సదస్సులోనే  తొలిసారి ఆసియా నుండి డాక్టర్ కేశవులు ఇస్టా వైస్ ప్రెసిండెంట్ గా ఎన్నికయ్యారు. ఇది మానవ వనరులు, సామర్థ్యం పెంపుదల, ప్రయోగశాలల సామర్థ్యం, నాణ్యతా హామీ వ్యవస్థలు, ప్రపంచ గుర్తింపుకు సహాయపడిందన్నారు. ఈజిప్ట్‌తో సహా వివిధ దేశాలకు అంతర్జాతీయ (OECD) విత్తన ధృవీకరణ ద్వారా విత్తన ఎగుమతులను ప్రోత్సహించడం, ఇస్టా గుర్తింపుతో ప్రపంచ స్థాయి విత్తన పరీక్షా ప్రయోగశాల ఏర్పాటు వంటి అనేక కొత్త కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని మంత్రి చెప్పారు.

ఈజిప్షియన్ వ్యవసాయ విధానం భారతదేశంతో సారూప్యత కలిగి ఉన్నది. భారత్ మాదిరిగానే ఈజిప్టు ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రధాన భాగం, దేశ స్థూల దేశీయోత్పత్తిలో 12 శాతం ఉండగా.  55 శాతం జనాభాకు ఉపాధిని కూడా కలిగి ఉన్నదన్న మంత్రి ఈజిప్టుతో OECD విత్తన ఎగుమతులు ప్రారంభమయ్యాయని, భవిష్యత్ లో మా సహకారం కొనసాగిస్తామన్న్నారు.

ఈ కార్యక్రమంలో ఇస్టా పూర్వపు ప్రెసిడెంట్ డాక్టర్ క్రెగ్ ఎంసి గిల్, ఇస్టా ప్రధాన కార్యదర్శి డాక్టర్ అండ్రూస్ వైస్, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ, ఇస్టా వైస్ చైర్మన్ డాక్టర్ కేశవులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : రానున్నది ఆయిల్‌ఫామ్ రోజులే: మంత్రి నిరంజన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్