Saturday, February 22, 2025
HomeTrending Newsనల్గొండలో ఐటీ హబ్‌

నల్గొండలో ఐటీ హబ్‌

Hub In Nalgonda :  నల్గొండ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఐటీ హబ్‌కు శంకుస్థాపనతో పాటు పాలిటెక్నీక్ కళాశాల ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో ఐటీహబ్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా దీన్ని నిర్మించనున్నారు.

ఐటీ హబ్‌ను 18నెలల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమాల్లో సహచర మంత్రులు జగదీష్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి లతో పాటు స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. అంతకుముందు నల్గొండలో కేటీఆర్‌కు తెరాస నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలో పార్టీ శ్రేణులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించాయి.

Also Read : హైదరాబాద్‌ ఫార్మాసిటీ సిద్ధం

RELATED ARTICLES

Most Popular

న్యూస్