Sunday, January 19, 2025
Homeసినిమా'బ్రో' టార్గెట్ ఫిక్స్ అయ్యిందా.?

‘బ్రో’ టార్గెట్ ఫిక్స్ అయ్యిందా.?

పవన్ కళ్యాణ్‌, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం ‘బ్రో’. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అయితే.. మేనమామ, మేనల్లుడు పవన్, తేజ్ కలిసి ఫస్ట్ టైమ్ నటిస్తుండడంతో బ్రో సినిమా పై మెగా అభిమానుల్లోనే కాదు.. సినీ అభిమానులు అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఇటీవల రిలీజ్ చేసిన బ్రో మూవీ మోషన్ పోస్టర్స్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేశాయి.

అయితే.. బ్రో మూవీ థియేట్రికల్ బిజినెస్ కంప్లీట్ అయ్యిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన బిజినెస్ లెక్కలు చూసుకుంటే.. ఆంధ్రాలో 40 కోట్లకి హక్కులని ముగ్గురు డిస్టిబ్యూటర్స్ కలిపి సొంతం చేసుకున్నారని… నైజాంలో 30 కోట్లకి డీల్ సెట్ అయ్యిందని… సీడెడ్ లో 13 కోట్లకి అమ్ముడయ్యాయని తెలిసింది. ఓవర్సీస్ లో 13 కోట్లకి డీల్ క్లోజ్ చేసుకొని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరో ఇద్దరితో కలిసి రిలీజ్ చేస్తోందని సమాచారం. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాకి సంబందించిన డీల్స్ పై చర్చలు జరుగుతున్నాయి.

ఓవరాల్ గా 100 కోట్ల వరకు బ్రో మూవీ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. అంటే పెద్ద బ్రేక్ ఎవెన్ టార్గెట్ తోనే బ్రో చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గతంలో భీమ్లా నాయక్, వకీల్ సాబ్ కి అడ్డంకులు ఏర్పడినట్లు ఈ చిత్రానికి లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా మూవీ భారీ కలెక్షన్స్ అందుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ సినిమాకి భారీగా క్రేజ్ ఉండడం.. తేజ్ విరూపాక్ష మూవీతో ఫామ్ లో రావడంతో బ్రో మూవీ పవన్, తేజ్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ సాదించిన సినిమాగా నిలుస్తుందని టాక్ బలంగా వినిపిస్తోంది. మరి.. బ్రో టార్గెట్ ఎంత వరకు రీజ్ అవుతుందో…? ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో..? చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్