Sunday, January 19, 2025
Homeసినిమామేఘ ఆకాశ్ కొంచెం వెయిట్ చేస్తే బాగుండేదేమో!

మేఘ ఆకాశ్ కొంచెం వెయిట్ చేస్తే బాగుండేదేమో!

మేఘ ఆకాశ్ .. అందమైన నవ్వు .. ఆకర్షణీయమైన రూపం ఉన్న కథానాయిక. తమిళనాడుకి చెందిన ఈ బ్యూటీ తెలుగు సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టింది. నితిన్ జోడీగా ‘లై’ సినిమాతో తెలుగు తెరకి  పరిచయమైంది. ఈ సినిమా సరిగ్గా ఆడకపోయినా, జోడీ బాగుందనే టాక్ వచ్చింది. కుదురైన రూపంతో కుందనపు బొమ్మలా ఉందని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మంచి మార్కులు ఇచ్చారు. ఇతర యంగ్ హీరోలకు జోడీగా ఆమె బిజీ అవుతుందని అంతా భావించారు.

కానీ మొదటి రెండు సినిమాలు  ఆడకపోవడం వలన ఆమెను మేకర్స్ పెద్దగా పట్టించుకోలేదు. పట్టించుకునేవరకూ మేఘ వెయిట్ చేయలేదు కూడా. కోలీవుడ్ వెళ్లి అక్కడ అవకాశాలను బాగానే సంపాదించుకుంది. వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. దాంతో తెలుగు సినిమాలతో గ్యాప్ వచ్చేసింది. ఆ తరువాత ‘రాజ రాజ చోర’ .. ‘డియర్ మేఘ’ అనే సినిమాలు చేసింది. ‘రాజ రాజ చోర’ సినిమా హిట్ అయినప్పుడు ఆమె సరైన ప్రాజెక్టుల కోసం వెయిట్ చేసి ఉంటే బాగుండేదేమో, కానీ ఆమె అలా చేయలేదు.

చిన్న హీరోల సినిమాలు ఒప్పుకోవడం .. అందునా ఇద్దరు .. ముగ్గురు కథానాయికలలో ఒకరిగా కనిపించడం చేస్తూ వచ్చింది. ఇక ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో హీరో కథ చెబుతుంటే వినే  పాత్రను చేసింది. ఇక హీరోయిన్ గా అవకాశాలు రావు అని నిర్ధారించుకున్న వారు చేయవలసిన పాత్ర అది. హీరోయిన్ కి ఉండవలసిన లక్షణాలన్నీ మేఘ ఆకాశ్ కి పుష్కలంగా ఉన్నాయి. కానీ సరైన ప్రాజెక్టులు ఎంచుకునే విషయంలోగానీ ..  స్టార్ డమ్ తెచ్చుకోవాలనే ఆలోచనగాని ఆమెకి లేవేమో అనిపిస్తోంది. ఇకనైనా మేఘ మేల్కొనకపోతే కష్టమే.

Also Read : ‘రాజరాజ చోర’లో ప్రతి పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది : మేఘా ఆకాశ్‌ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్