Its a Stunt: ముందస్తు ప్రణాళిక ప్రకారమే తెలుగుదేశం పార్టీ సభలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇదంతా చేశారని, గవర్నర్ పై దాడికి వారు ప్రయత్నించారని ఆరోపించారు.
గవర్నర్ ఏ పార్టీకో చెందిన వ్యక్తి కాదని, పెద్ద మనిషి, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి అని కూడా చూడకుండా అసభ్యంగా ప్రవర్తించారని శ్రీకాంత రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబే వీరిని ఇలా ట్రైనింగ్ ఇచ్చి పంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అసలు ప్రసంగంలో ఏముందో చూడకుండా, ప్రతులు చించి విసిరివేయడం సరికాదన్నారు. పదే పదే వ్యవస్థల గురించి మాట్లాడే టిడిపి నేతలు నేటి ప్రవర్తనపై వారికి వారు గుండెలపై చేయి వేసుకొని ప్రశ్నించుకోవాలన్నారు. సంస్కారహీనంగా ప్రవర్తించడం ఎంతవరకూ సమంసజమని ప్రశ్నించారు.
ప్రజల సమస్యలపై చర్చించేందుకు వారు సభకు రావడం లేదని, కేవలం సెన్సేషన్ సృష్టించేందుకే వస్తున్నట్లు కనబడుతోందన్నారు. రాజధాని చుట్టూ ఉన్నవందమంది బినామీలను కాపాడుకోవడం తప్ప వేరే ఉద్దేశం టిడిపికి లేదని దుయ్యబట్టారు. వారు కోరిన అంశాలపై చర్చించేందుకు, తగిన సమయం కేటాయించేందుకు కూడా ప్రభుత్వం తరఫున దానికి సిద్ధంగా ఉన్నామని కానీ ఇలా దిగజారి ప్రవరించడం బాగాలేదన్నారు.
Also Read : అక్కడికే వెళ్ళండి: బొత్సకు అచ్చెన్న కౌంటర్