Saturday, January 18, 2025
Homeసినిమాస్పీడ్ పెంచుతున్న ఇవానా!

స్పీడ్ పెంచుతున్న ఇవానా!

వెండితెరకి చైల్డ్ ఆర్టిస్టులుగా పరిచయమైన అమ్మాయిలలో చాలా తక్కువ మంది మాత్రమే హీరోయిన్ గా ఎదుగుతూ వచ్చారు. శ్రీదేవి .. మీనా .. కీర్తి సురేశ్ .. ఇలా ఆ జాబితాలో కొంతమంది కనిపిస్తారు. ఆ దిశగా అడుగులు వేస్తూ వచ్చిన కథానాయికగా ఇవానా కనిపిస్తుంది. చైల్డ్ ఆర్టిస్టుగా ఇవానా 2012లోనే ఓ మలయాళం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత అలా కొన్ని సినిమాలు చేస్తూ, నటన పరంగా గట్టిగానే అనుభవాన్ని సంపాదించింది.

తమిళంలో ‘లవ్ టుడే’ సినిమాతో హీరోయిన్ గా ఇవానా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అదే టైటిల్ తో తెలుగులోను విడుదలైంది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. విశాలమైన కళ్లతో .. ఆకర్షణీయమైన రూపంతో ఇవానా కుర్రాళ్ల మనసులను థియేటర్లలోనే కట్టిపడేసింది. దాంతో ఈ బ్యూటీకి తెలుగు నుంచి కూడా అవకాశాలు వెళ్లడం మొదలైంది. తెలుగులో ఆమె చేసిన ‘సెల్ఫిష్’ ఇంకా విడుదల కావలసి ఉంది.

ఈ నేపథ్యంలోనే మరొక సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే ‘LGM’ (లెట్స్ గెట్ మ్యారీడ్). క్రికెటర్ ధోని .. ఆయన శ్రీమతి కలిసి నిర్మించడం ఈ సినిమాకి గల మరో ప్రత్యేకత. రీసెంట్ గా వదిలిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కాన్సెప్ట్ గా కూడా కొత్తగా .. సరదాగా ఉంది. అందువలన ఈ సినిమాలో సక్సెస్ అయ్యే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్పీడ్ పెంచిన ఇవానా, ఈ సినిమాతో మరింత బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్